Home> క్రీడలు
Advertisement

Avesh Khan Yorker: అవేశ్ ఖాన్ డెడ్లీ యార్కర్.. రెండు ముక్కలైన డస్సెన్ బ్యాట్! స్పీడ్ అంటే ఇది

IND vs SA: Avesh Khan yorker breaks Rassie van der Dussen bat into two pieces. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ సమయంలో భారత పేసర్ ఆవేశ్‌ ఖాన్‌ వేసిన ఒక బంతి బ్యాట్‌ను రెండు ముక్కలుగా చేసింది. 
 

Avesh Khan Yorker: అవేశ్ ఖాన్ డెడ్లీ యార్కర్.. రెండు ముక్కలైన డస్సెన్ బ్యాట్! స్పీడ్ అంటే ఇది

Avesh Khan yorker breaks Rassie van der Dussen bat into two pieces: గురువారం రాత్రి టీమిండియాతో ఉత్కంఠ‌గా సాగిన తొలి టీ20 మ్యాచులో ద‌క్షిణాఫ్రికా అద్భుత విజయం అందుకుంది. భార‌త్ నిర్దేశించిన 212 ప‌రుగుల లక్ష్యంను 19.1 ఓవర్లలో సఫారీ జట్టు చేధించింది. డేవిడ్ మిల్ల‌ర్‌ (64 నాటౌట్‌; 31 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లు), వాన్‌డెర్‌ డసెన్‌ (75 నాటౌట్‌; 46 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగడంతో ద‌క్షిణాఫ్రికా సునాయాస విజయం సాధించింది. ఈ ఇద్దరు నాలుగో వికెట్‌కు ఏకంగా 131 పరుగులు జోడించారు. ఈ విజయంతో ఐదు మ్యాచుల టీ20 సిరీసులో దక్షిణాఫ్రికా ప్రస్తుతం 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

తొలి టీ20లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ సమయంలో భారత పేసర్ ఆవేశ్‌ ఖాన్‌ వేసిన ఒక బంతి బ్యాట్‌ను రెండు ముక్కలుగా చేసింది. ఇన్నింగ్స్‌ 14వ ఓవర్‌లోని మూడో బంతిని ఆవేశ్‌ ఆఫ్‌సైడ్‌ దిశగా డెడ్లీ యార్కర్‌ వేశాడు. క్రీజులో ఉన్న రాస్సీ వాన్ డెర్ డుసెన్‌ బంతిని ఆఫ్ ఆడే ప్రయత్నం చేశాడు. మోకాలిపై కూర్చుని బలంగా షాట్ ఆడాడు. మిడిల్‌లో తాకిన బంతి బ్యాట్‌ను రెండు ముక్కలుగా చేసింది. ఆపై మిడ్ ఆఫ్ సైడ్ దూసుకెళ్లింది. 

బ్యాట్‌ను రెండు ముక్కలు అవడం చూసిన రాస్సీ వాన్ డెర్ డుసెన్‌ తన బ్యాట్‌ను పరిశీలించాడు. ఆవేశ్‌ ఖాన్‌ సహా టీమిండియా ఆటగాళ్లు నవ్వుకున్నారు. ఇందుకు సమందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఫాన్స్ అందరూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 'అవేశ్ ఖాన్ డెడ్లీ యార్కర్' అని ఒకరు కామెంట్ చేయగా.. 'వారెవ్వా ఏం స్పీడు భయ్యా' అని ఇంకొకరు ట్వీట్ చేశారు. 'నువ్ సూపర్ భయ్యా', 'స్పీడ్ అంటే ఇది', 'రెండు ముక్కలైన బ్యాట్' అంటూ కామెంట్స్ వస్తున్నాయి. 

అవేష్ ఖాన్ దెబ్బ దెబ్బకు రాస్సీ వాన్ డెర్ డస్సెన్ తన విరిగిన బ్యాట్‌ను భర్తీ చేయాల్సి వచ్చింది. అవేష్ ఆ బంతిని 140 కి.మీ కంటే ఎక్కువ వేగంతో బౌలింగ్ చేశాడు. ఈ మ్యాచ్‌లో అవేష్ ఖాన్ 4 ఓవర్లలో 35 పరుగులు ఇచ్చాడు. అయితే అతడికి ఒక్క వికెట్ కూడా దక్కలేదు. ఐపీఎల్ 2022లో అవేష్ 18 మ్యాచుల్లో 13 వికెట్లు పడగొట్టాడు. 

Also Read: Parul Yadav Hot Pics: పరుల్ యాదవ్ క్లీవేజ్ షో.. హాట్ అందాలతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోందిగా!  

Also Read: Skin Care: చర్మ సౌదర్యం తగ్గిపోతుందా..ఈ చిట్కాలను పాటించండి..!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Read More