Home> క్రీడలు
Advertisement

Ishan Kishan: ధోనీ ఆడిన జార్ఖండ్ జట్టుకు ఇషాన్ కిషన్ ఎందుకు మారాడు..? అసలు నిజం ఇదే..!

Ind VS Pak Asia Cup 2023: ధోనీ, ఇషాన్ కిషన్ ఒకే రాష్ట్రానికి చెందిన వారని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఇషాన్ కూడా జార్ఖండ్ తరుఫున ఆడుతుండడంతో చాలా మంది అలానే ఫిక్స్ అయిపోయారు. కానీ కిషన్‌ బీహార్‌కు చెందినవాడు. రాంచీకి ఎందుకు మారిపోయాడంటే..?
 

Ishan Kishan: ధోనీ ఆడిన జార్ఖండ్ జట్టుకు ఇషాన్ కిషన్ ఎందుకు మారాడు..? అసలు నిజం ఇదే..!

Ind VS Pak Asia Cup 2023: ఆసియా కప్‌లో పాకిస్థాన్‌ జరుగుతున్న పోరులో ఇషాన్ కిషన్ మెరుపులు మెరిపించాడు. 48 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజ్‌లోకి వచ్చిన ఇషాన్.. హార్థిక్ పాండ్యాతో కలిసి జట్టును ఆదుకున్నాడు. వికెట్లు పడినా.. రన్‌రేట్ తగ్గకుండా వేగంగా బ్యాటింగ్ చేశాడు. 81 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 82 పరుగులు చేశాడు. అయితే సెంచరీకి చేరువగా వచ్చి ఔట్ అయ్యాడు. ఇషాన్ మెరుపులతో పాక్ జట్టు ముందు పోరాడే లక్ష్యాన్ని ఉంచింది. 48.5 ఓవర్లలో టీమిండియా 266 పరుగులకు ఆలౌట్ అయింది. 

గతేడాది రిషబ్ పంత్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన తరువాత ఇషాన్ కిషన్ వన్డే జట్టులోకి ప్రవేశించాడు. కేఎల్ రాహుల్ కూడా తొడ గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో ఇషాన్‌కు పాకిస్థాన్‌పై ఆడే అవకాశం లభించింది. కిషన్ దేశవాళీ క్రికెట్‌లో జార్ఖండ్ రాష్ట్ర జట్టుకు ఆడుతున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే ఈ యంగ్ వికెట్ కీపర్ జార్ఖండ్ తరపున ఆడుతున్నందున.. ధోని సొంత నగరమైన రాంచీకి చెందినవాడని అభిమానులలో అపోహ ఉంది. ఇషాన్ జార్ఖండ్ తరపున ఆడుతున్నా..  కానీ అతను ఆ రాష్ట్రానికి చెందినవాడు కాదు. బీహార్‌లోని పాట్నాకు చెందినవాడు. 

25 ఏళ్ల వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ అయిన ఇషాన్.. 2016 ప్రపంచ కప్‌లో భారత U19 జట్టుకు నాయకత్వం వహించాడు. బీహార్‌లోని పాట్నాకు ప్రణవ్ కుమార్ పాండే, సుచిత్రా సింగ్ దంపతులకు జన్మించాడు. అతని తండ్రి బిల్డర్. కిషన్ క్రికెట్ ప్రతిభను గుర్తించిన మొదటి కోచ్ ఉత్తమ్ మజుందార్.. క్రికెట్ ప్రాక్టీస్‌కు పంపించకుండా అడ్డుకోవద్దని కోరాడు. భవిష్యత్‌లో టీమిండియాకు ఆడతాడని చెప్పాడు.

ఐపీఎల్‌లో ఇషాన్ కిషన్ వేలానికి వచ్చిన రోజే.. తండ్రి ప్రణవ్ వేలం రోజున అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. అయితే వేలంలో కిషన్ ఎంపికయ్యాడని తెలియగానే త్వరగా కోలుకున్నారు. ఇక క్రికెట్ ఆడేందుకు కిషన్ రాంచీకి వెళ్లడానికి కారణం ఉంది. బీసీసీఐ, బీహార్ క్రికెట్ అసోసియేషన్ (బీసీఏ) మధ్య రిజిస్ట్రేషన్ సమస్య ఉండడంతో ఓ సీనియర్ ఆటగాడు ఇచ్చిన సలహాతో ఇషాన్‌ కిషన్ రాంచీ జట్టుకు మారాడు. అప్పుడు అతని వయసు కేవలం 12 ఏళ్లు మాత్రమే. ఆ వయసులో తన కొడుకును దూరంగా పంపించేందుకు తల్లి సుచిత్ర చాలా బాధపడ్డారు. ఇషాన్‌కు రాజ్ కిషన్ అనే అన్నయ్య ఉన్నాడు. ఆయన కూడా క్రికెటర్ కావాలనుకున్నాడు. అయితే కుటుంబ సమస్యల కారణంగా తన కలను పక్కనబెట్టి.. చదువుపై ఎక్కువ దృష్టిపెట్టాడు. ప్రస్తుతం  వైద్యుడిగా స్థిరపడ్డాడు. 

Also Read: Deepthi Murder Case: దీప్తి హత్య కేసులో సంచలన విషయాలు.. దారుణంగా చంపేసిన చందన  

Also Read: Mission Aditya L1: నింగిలోకి దూసుకెళ్లిన ఆదిత్య L1.. ఇస్రో మరో ప్రయోగం సక్సెస్  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Read More