Home> క్రీడలు
Advertisement

Prithvi Shaw vs Shubman Gill: వన్డేలకు గిల్‌.. టీ20లకు పృథ్వీ షా సరిగ్గా సరిపోతారు: మాజీ ఓపెనర్

Gautam Gambhir feels Shubman Gill is perfect for only ODIs. టీమిండియా యువ బ్యాటర్ శుభ్‌మన్‌ గిల్‌ ప్రదర్శనపై టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. 
 

Prithvi Shaw vs Shubman Gill: వన్డేలకు గిల్‌.. టీ20లకు పృథ్వీ షా సరిగ్గా సరిపోతారు: మాజీ ఓపెనర్

Gautam Gambhir feels Shubman Gill for ODIs and Prithvi Shaw is perfect for T20s: టీమిండియా యువ బ్యాటర్ శుభ్‌మన్‌ గిల్‌ డబుల్ సెంచరీ, సెంచరీ బాదిన విషయం తెలిసిందే. న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి వన్డేలో డబుల్ సెంచరీ (208; 145 బంతుల్లో 19 ఫోర్లు, 9 సిక్సర్లు) బాదిన గిల్.. మూడో వన్డేలో సెంచరీ (112; 78 బంతుల్లో 13 ఫోర్లు, 5 సిక్స్‌లు) చేశాడు. మూడు వన్డేల సిరీస్‌లో గిల్‌ 360 పరుగులు చేశాడు. దాంతో భవిష్యత్తులో స్టార్‌ బ్యాటర్‌ అవుతాడని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అయితే వన్డేల్లో రాణించిన విధంగా టీ20ల్లో పరుగులు చేయలేకపోతున్నాడు. కివీస్‌తో టీ20 సిరీసులో ఆడిన రెండు మ్యాచులలో 7, 11 రన్స్ చేశాడు. ఈ నేపథ్యంలో గిల్‌ ప్రదర్శనపై టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

టీ20 ఫార్మాట్‌లో శుభ్‌మన్‌ గిల్‌ రాణించలేకపోతున్నాడని.. యువ బ్యాటర్ పృథ్వీ షా టీ20లకు సరిగ్గా సరిపోతాడని గౌతమ్ గంభీర్‌ అభిప్రాయపడ్డారు. స్టార్ స్పోర్ట్స్‌లో గంభీర్ మాట్లాడుతూ... 'స్పిన్ బౌలింగ్‌లో గిల్‌ ఇంకా బాగా ఆడాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా స్పిన్‌ పిచ్‌ పైన అతడు ఇబ్బంది పడుతున్నాడు. బంగ్లాదేశ్‌లోనూ ఇబ్బందికి గురయ్యాడు. అయితే వన్డేలలో అద్భుతంగా ఆడుతున్నాడు. బంతి తిరగడం, బౌన్స్‌ అయినప్పుడు ఆడటం బ్యాటర్‌కు అసలైన పరీక్ష. ఇలాంటి విషయంలో గిల్ ఇంకా మెరుగు కావాల్సిన అవసరం ఉంది. పేస్‌ బౌలింగ్‌ను మాత్రం బాగా ఆడుతున్నాడు' అని అన్నారు. 

'శుభ్‌మన్‌ గిల్‌ ఇంకా టీ20 ఫార్మాట్‌లో సరిగ్గా ఆడలేకపోతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇంకాస్త దూకుడు ఉండాలి. గిల్ 50 ఓవర్ల ఫార్మాట్‌కు సరిగ్గా సరిపోతాడని నా అభిప్రాయం. పృథ్వీ షా లాంటి బ్యాటర్ మాత్రం టీ20 ఫార్మాట్‌లో రాణించగలడు. అందుకే వీలైనంత త్వరగా టీ20ల్లో మెరుగైతేనే గిల్‌ తన స్థానంను నిలబెట్టుకోగలడు. అప్పుడే మూడు ఫార్మాట్లలో ఆడేందుకు అవకాశం ఉంటుంది' అని మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్‌ పేర్కొన్నారు.

Also Read: Lucknow Pitch Curator: రెండో టీ20 మ్యాచ్‌పై భారత కెప్టెన్‌ అసహనం.. పిచ్‌ క్యురేటర్‌పై వేటు!  

Also Read: Ellyse Perry Pics: అందంతో మతులు పోగొడుతున్న మహిళా క్రికెటర్‌.. నెట్టింట వైరల్‌గా మారిన హాట్ స్టిల్స్!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Read More