Home> క్రీడలు
Advertisement

Virat Kohli Post: విరాట్ కోహ్లీ ఇంట్రెస్టింగ్ పోస్టు.. నేను కింద ప‌డితే ఏమౌతుంది అంటూ..!

Virat Kohli Interesting Post Goes Viral. ప్రేర‌ణాత్మ‌క మెసేజ్ ఉన్న ఓ పెయింటింగ్ ఫోటో వ‌ద్ద దిగిన ఫోటోను విరాట్ కోహ్లీ ఈరోజు ట్వీట్ చేశాడు. 
 

Virat Kohli Post: విరాట్ కోహ్లీ ఇంట్రెస్టింగ్ పోస్టు.. నేను కింద ప‌డితే ఏమౌతుంది అంటూ..!

Virat Kohli Interesting Post Goes Viral: భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యంత సంధి దశను ఎదుర్కొంటున్నాడు. 2019 నవంబర్ 22 నుంచి సెంచరీ చేయలేక సతమతమవుతున్నాడు. గత మూడేళ్లుగా తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదు. ఇటీవలి కాలంలో కూడా మంచి ఇన్నింగ్స్ ఆడిన దాఖలు లేవు. ఇంగ్లండ్‌ పర్యటనలో కోహ్లీ బ్యాట్‌తో పేలవ ప్రదర్శన కనబరిచాడు. మూడు ఫార్మాట్లలో కలిఫై 11,  20, 1, 11, 16 ర‌న్స్ చేశాడు. దాంతో కోహ్లీ ఆట‌తీరు అభిమానుల్ని క‌లిచివేస్తోంది. మరోవైపు దిగ్గజాలు కోహ్లీకి స‌ల‌హాలు ఇస్తూనే ఉన్నారు. అయితే శనివారం త‌న ట్విట్ట‌ర్‌లో కోహ్లీ ఓ ఇంట్రెస్టింగ్ పోస్టు చేశాడు.

ప్రేర‌ణాత్మ‌క మెసేజ్ ఉన్న ఓ పెయింటింగ్ ఫోటో వ‌ద్ద దిగిన ఫోటోను విరాట్ కోహ్లీ ఈరోజు ట్వీట్ చేశాడు. ఆర్టిస్ట్ వేసిన ప‌క్షి రెక్క‌ల బొమ్మ వ‌ద్ద కూర్చున్న ఫోటోను పోస్ట్ చేశాడు. అయితే పేంటింగ్‌కు ఓ మెసేజ్ కూడా ఉంది. 'వాట్ ఇఫ్ ఐ ఫాల్‌.. ఓహ్ బ‌ట్ మై డార్లింగ్‌, వాట్ ఇఫ్ యూ ఫ్ల‌య్' అని పేంటింగ్‌పై రాసి ఉంది. 'నేను కింద ప‌డితే ఏమౌతుంది.. మై డార్లింగ్ నువ్వు ఎగురుతున్నావ్ క‌దా' అని దాని అర్ధం. మొత్తానికి తన వస్తున్న విమర్శలకు కోహ్లీ ఇలా బదులిచ్చాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. పర్‌స్పెక్టివ్ అనే క్యాప్షన్‌ను కూడా జత చేశాడు. 

ఇంగ్లండ్‌తో జ‌రిగిన అయిదో టెస్టులో విరాట్ కోహ్లీ మొదటి ఇన్నింగ్స్‌లో 11, రెండో ఇన్నింగ్స్‌లో 20 ర‌న్స్ చేశాడు. రెండు టీ20ల్లో వరుసగా 1, 11 ర‌న్స్ చేశాడు. గాయం కారణంగా చివరి టీ20, మొదటి వన్డే ఆడలేదు. ఇక రెండో వ‌న్డేలో 16 ర‌న్స్ చేశాడు. ఆదివారం ఇంగ్లండ్‌తో జ‌రిగే మూడ‌వ వ‌న్డేలో ఆడ‌నున్నాడు. ప్రస్తుతం విరాట్ ఫామ్ హాట్ టాపిక్‌గా మారింది. విశ్రాంతి ఇవ్వాలని భావించిన బీసీసీఐ.. వెస్టిండీస్ పర్యటనకు కోహ్లీని ఎంపిక చేయలేదు. టీ20 ప్రపంచకప్ 2022కి సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో కోహ్లీ ఫామ్ అందుకోవాలని అందరూ ఆశిస్తున్నారు. 

Also Read: Kohli-Sachin: మరోసారి చెబుతున్నా.. కోహ్లీ విషయంలో సచిన్‌ జోక్యం చేసుకోవాల్సిందే: జడేజా

Also Read: Revanth Reddy: వరదలను జాతీయ విపత్తుగా చూడండి..ప్రధాని మోదీకి రేవంత్‌ రెడ్డి లేఖ..!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Read More