Home> క్రీడలు
Advertisement

IND vs ENG 2nd Test: వీరూ స్టైల్లో సెంచరీ కొట్టిన యశస్వి జైస్వాల్.. భారీ స్కోర్ దిశ‌గా టీమిండియా..

IND vs ENG 2nd Test: వైజాగ్ టెస్టులో టీమిండియా యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ సెంచరీతో గర్జించాడు. ఇంగ్లీష్ బౌలర్ల పై ఆధిపత్యం చెలాయిస్తూ భారత స్కోరు బోర్డును పరుగులెత్తిస్తున్నాడు. 
 

IND vs ENG 2nd Test: వీరూ స్టైల్లో సెంచరీ కొట్టిన యశస్వి జైస్వాల్.. భారీ స్కోర్ దిశ‌గా టీమిండియా..

IND vs ENG 2nd Test Live Score: వైజాగ్ టెస్టులో టీమిండియా బ్యాటర్లు చెలరేగి ఆడుతున్నారు. ఓపెనర్ యశస్వి జైస్వాల్(104 నాటౌట్ :156 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స‌ర్ల‌తో) శ‌త‌కంతో మెరిశాడు. తొలి టెస్టులో తృటిలో సెంచ‌రీ చేజార్చుకున్న యశస్వి.. తాజాగా ఆ మార్కును అందుకున్నాడు. ఇతడు సిక్సర్ తో తన సెంచరీని పూర్తి చేయడం విశేషం. టెస్టు ఫార్మాట్‌లో ఇతడికి ఇది రెండో సెంచరీ కాగా.. సొంత గడ్డపై తొలి టెస్టు శతకం. యశస్వి దూకుడుగా ఆడుతుంటడంతో భారత్ భారీ స్కోరు దిశగా దూసుకుపోతుంది. మ‌రో ఎండ్‌లో శ్రేయాస్ అయ్య‌ర్(23) ఇతడికి చక్కటి సహకారం అందిస్తున్నాడు. వీరిద్దరూ మూడో వికెట్ కు 86 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ కు ఓపెనర్లు రోహిత్, యశస్వి మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని కొత్త కుర్రాడు స్పిన్న‌ర్ బ‌షీర్ విడదీశాడు. తన నాలుగో ఓవర్లోనే డేంజ‌రస్ రోహిత్ శ‌ర్మ‌(14)ను ఔట్ చేసి ఇంగ్లండ్‌కు బ్రేక్ ఇచ్చాడు. అనంతరం క్రీజులోకి వచ్చి శుభ్‌మ‌న్ గిల్ ఆచితూచి ఆడుతూ స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. యశస్వి, గిల్ రెండో రెండో వికెట్‌కు 49 ర‌న్స్ జోడించారు. అయితే వెట‌ర‌న్ పేస‌ర్ అండ‌ర్స‌న్ అద్భుతమైన డెలివరీతో గిల్ ను బోల్తా కొట్టించాడు. దీంతో భారత్ 89 పరుగుల వద్ద రెండో వికెట్ ను కోల్పోయింది. ప్రస్తుతం టీమిండియా టీమిండియా 50 ఓవ‌ర్ల‌కు 2 వికెట్ల న‌ష్టానికి 175 పరుగులు చేసింది. యశస్వి, శ్రేయస్ క్రీజులో ఉన్నారు. 

Also Read: IND vs ENG 2nd Test Updates: రెండో టెస్టులో టాస్ గెలిచిన భారత్.. టీమ్‌లోకి యంగ్ ప్లేయర్ ఎంట్రీ..!

Also Read: Agni Chopra: చరిత్ర సృష్టించిన 12th ఫెయిల్ డైరెక్టర్ కొడుకు.. క్రికెట్ హిస్టరీలో ఒకే ఒక్కడు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More