Home> క్రీడలు
Advertisement

IND vs AUS 3rd ODI Highlights: ఆసీస్ గడ్డపై పరువు నిలిపిన పాండ్యా, జడేజా

India Vs Australia 3rd ODI Highlights  | ఆల్ రౌండర్లు హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా టీమిండియా పరువు కాపాడారు. లేకపోతే మూడో వన్డేలోనూ ఓటమిపాలై సిరీస్‌లో టీమిండియా వైట్ వాష్‌నకు గురయ్యేది. కాన్‌బెర్రా వేదికగా జరిగిన మూడో వన్డేలో భారత్ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది.

IND vs AUS 3rd ODI Highlights: ఆసీస్ గడ్డపై పరువు నిలిపిన పాండ్యా, జడేజా

IND vs AUS 3rd ODI Highlights: ఆతిథ్య ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో భారత్ విజయం సాధించింది. ఆల్ రౌండర్లు హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా టీమిండియా పరువు కాపాడారు. లేకపోతే మూడో వన్డేలోనూ ఓటమిపాలై సిరీస్‌లో టీమిండియా వైట్ వాష్‌నకు గురయ్యేది. కాన్‌బెర్రా వేదికగా జరిగిన మూడో వన్డేలో భారత్ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది.

 

తొలి రెండు వన్డేల్లో చిత్తుగా ఓడిపోయిన విరాట్ కోహ్లీ సేన మూడో వన్డేలో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రాణించింది. తొలుత టాస్ గెలిచిన విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్ శుభ్‌మాన్ గిల్ (33) పరవాలేదనిపించాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ (63: 73 బంతుల్లో 5 ఫోర్లు), హార్దిక్‌ పాండ్యా (92 నాటౌట్: 76 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్), రవీంద్ర జడేజా (66 నాటౌట్: 50 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు ) హాఫ్ సెంచరీలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో భారత్ 5 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది.

India Vs Australia ODI Series: క్రికెట్‌లో ఆ షాట్‌ను నిషేధించాలి.. తెరపైకి కొత్త వాదన

 

303 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ ఈ వన్డేలోనూ నెగ్గేలా కనిపించింది. కానీ చివర్లో వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ ఆరోన్ ఫించ్ (75: 82 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆల్ రౌండర్ మాక్స్‌వెల్ (59 నాటౌట్: 38 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్ సెంచరీలు చేశారు. కీపర్ క్యారీ 38 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. చివర్లో భారత బౌలర్లు పుంజుకోవడంతో మరో బంతులు మిగిలుండగానే ఆసీస్ ఆలౌటైంది. 303 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌ 49.3 ఓవర్లలో 289 పరుగులకు ఆలౌటైంది. 13 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించి సిరీస్‌లో ఆసీస్ ఆధిక్యాన్ని 2-1కు తగ్గించింది.

IND vs AUS 3rd ODI Live Updates: క్రికెట్ చరిత్రలో విరాట్ కోహ్లీ అరుదైన ఘనత

 

ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ వన్డేల్లో 12 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. అత్యంత వేగంగా ఈ ఫీట్ చేరుకున్న క్రికెటర్‌గా భారత కెప్టెన్ నిలిచాడు. సచిన్ 300 ఇన్నింగ్స్‌లలో 12వేల వన్డే పరుగులు చేయగా, కోహ్లీకి 242లు ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా మొదటి టీ20 మ్యాచ్ డిసెండర్‌ 4న ఇదే స్టేడియంలో జరగనుంది.

Benifits Of EPF Account: మీకు ఈపీఎఫ్ అకౌంట్ ఉందా.. ఈ బెనిఫిట్స్ తెలుసా!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 
Read More