Home> క్రీడలు
Advertisement

IND VS AUS, 3rd ODI Match Highlights: 3వ వన్డే మ్యాచ్‌లో 66 పరుగుల తేడాతో టీమిండియాను ఓడించిన ఆస్ట్రేలియా

IND VS AUS, 3rd ODI Match Highlights: మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భాగంగా నేడు రాజ్ కోట్ స్టేడియంలో జరిగిన 3వ వన్డేలో ఆస్ట్రేలియా జట్టు 66 పరుగుల తేడాతో టీమిండియాపై విజయం సాధించింది. కానీ సిరీస్ మాత్రం 2-1 తేడాతో భారత్ వశమైంది.

IND VS AUS, 3rd ODI Match Highlights: 3వ వన్డే మ్యాచ్‌లో 66 పరుగుల తేడాతో టీమిండియాను ఓడించిన ఆస్ట్రేలియా

IND VS AUS, 3rd ODI Match Highlights: మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భాగంగా నేడు రాజ్ కోట్ స్టేడియంలో జరిగిన 3వ వన్డేలో ఆస్ట్రేలియా జట్టు 66 పరుగుల తేడాతో టీమిండియాపై విజయం సాధించింది. కానీ సిరీస్ మాత్రం 2-1 తేడాతో భారత్ వశమైంది. మొదటి రెండు వన్డేల్లో భారత్ గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ కారణంగానే మూడో వన్డే ఓటమి చెందినప్పటికీ భారత్ సిరీస్ కైవసం చేసుకోగలిగింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 352 పరుగులు భారీ స్కోర్ చేసి టీమిండియా ఎదుట భారీ విజయ లక్ష్యాన్ని ఉంచింది.

ఆసిస్ ఓపెనర్స్ డేవిడ్ వార్నర్ 34 బంతుల్లో నాలుగు సిక్సులు, ఆరు ఫోర్లు బాది 56 పరుగులు రాబట్టగా, మిచెల్ మార్ష్ 84 బంతుల్లో 3 సిక్సులు, 13 ఫోర్లు కొట్టి 96 పరుగులతో ఆస్ట్రేలియా జట్టుకు శుభారంబాన్నిచ్చారు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన స్టీవ్ స్మిత్ 74 పరుగులు , మార్నస్ 72 పరుగులు చేసి చెరొక హాఫ్ సెంచరీతో చెలరేగిపోయారు. చివర్లో వచ్చిన ప్యాట్ కమిన్స్ కూడా నెమ్మదిగా 19 పరుగులు రాబట్టడంతో మొత్తానికి ఆసిస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 352 పరుగుల భారీ స్కోర్ సాధించింది. స్కోర్ బోర్డును పరుగెత్తించడంలో ఆసిస్ బ్యాట్స్ మెన్ల సమిష్టి కృషి కనిపించింది. 

భారత బౌలర్లలో జస్ప్రిత్ బుమ్రా 3 వికెట్లు తీసుకున్నప్పటికీ 81 పరుగులు సమర్పించుకున్నాడు. కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు తీసి 48 పరుగులు ఇచ్చాడు. మొహమ్మద్ సిరాజ్, ప్రసీద్ కృష్ణలకు చెరో వికెట్ దక్కింది.

అనంతరం 353 భారీ పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు ఓపెనర్ రోహిత్ శర్మ 57 బంతుల్లో 81 పరుగులు చేసి శుభారంభాన్నే ఇచ్చినప్పటికీ.. మరో ఓపెనర్ వాషింగ్టన్ సుందర్ మాత్రం 30 బంతుల్లో 18 పరుగులు మాత్రమే చేసి సమయం వృధా చేశాడు. ఆ తరువాత బ్యాటింగ్ కి వచ్చిన విరాట్ కోహ్లీ 61 బంతుల్లో 56 పరుగులు చేసి హాఫ్ సెంచరీని పూర్తి చేసుకోగా.. శ్రేయాస్ అయ్యర్ 43 బంతుల్లో 48 పరుగులు చేసి జస్ట్ లో హాఫ్ సెంచరీని మిస్ అయ్యాడు. కేఎల్ రాహుల్ 26 పరుగులకే మిచెల్ స్టార్క్ బౌలింగ్ లో అలెక్స్ కేరీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

ఇది కూడా చదవండి : IND Vs AUS 3rd ODI Updates: టాస్ గెలిచిన ఆసీస్.. తుది జట్లలో భారీ మార్పులు.. మ్యాచ్‌కు ముందు షాక్..!

మధ్యలో రవింద్ర జడేజా కొంత దూకుడు చూపించి ఆటను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్న క్రమంలోనే 35 పరుగులు చేసిన అనంతరం తన్వీర్ సంగ్మ బౌలింగ్ లో ఎల్బీడబ్లూ అయి వికెట్ల ముందే దొరికిపోయాడు. ఇక సూర్యకుమార్ యాదవ్ సహా మిగతా ఆటగాళ్లంతా సింగిల్ డిజిట్ స్కోర్ కే పరిమితమయ్యారు. మరోవైపు భారత ఆటగాళ్లను పరుగులు చేయకుండా కట్టడి చేయడంలోనూ ఆసిస్ బౌలర్స్ సమిష్టి కృషి కనబరిచారు. ఫలితంగా టీమిండియా 286 పరుగులకే ఇన్నింగ్స్ ముగించింది. అలా వన్డే మ్యాచ్ ఆసిస్ వశమైంది. ఆసిస్ బౌలర్లలో గ్లెన్ మాక్స్‌వెల్ 40 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీసుకోగా.. జోష్ హెజల్ వుడ్ 2 వికెట్లు, మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్, క్యామరూన్ గ్రీన్ , తన్వీర్ సంగ్మ తలా ఒక వికెట్ తీసుకున్నారు.

ఇది కూడా చదవండి : Kushal Malla: 34 బంతుల్లో సెంచరీ.. రోహిత్ శర్మ రికార్డు గోవింద.. గోవిందా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More