Home> క్రీడలు
Advertisement

Ind Vs Aus: సరికొత్త రికార్డు సృష్టించిన రవీంద్ర జడేజా.. ఇమ్రాన్ ఖాన్ రికార్డు బద్దలు

Ravindra Jadeja Records: రెండో టెస్టులో టీమిండియా పట్టుబిగిస్తోంది. కంగారు జట్టును మరోసారి తక్కువ స్కోరుకే కట్టడి చేస్తోంది. ఇక ఈ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా అరుదైన రికార్డు సృష్టించాడు. పాక్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ రికార్డును బద్ధలు కొట్టాడు.
 

Ind Vs Aus: సరికొత్త రికార్డు సృష్టించిన రవీంద్ర జడేజా.. ఇమ్రాన్ ఖాన్ రికార్డు బద్దలు

Ravindra Jadeja Records: ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా సరికొత్త రికార్డు సృష్టించాడు. పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పేరిట ఉన్ రికార్డును బద్ధలు కొట్టాడు. టెస్ట్ క్రికెట్ చరిత్ర‌లో అత్యంత వేగంగా 2500 పరుగులు, అత్యంత వేగంగా 250 వికెట్లు తీసిన తొలి ఆసియా క్రికెటర్‌గా నిలిచాడు. ఇమ్రాన్ ఖాన్ 64 టెస్ట్ ఇన్నింగ్స్‌లలో 2500 రన్స్, 250 వికెట్లు సాధించగా.. జడ్డూ 62 టెస్టు ఇన్నింగ్స్‌ల్లోనే ఈ రికార్డను బ్రేక్ చేసి రికార్డు క్రియేట్ చేశాడు. 
 
ఆసియాలో ఈ ఘనత సాధించిన మొదటి ప్లేయర్‌గా.. ప్రపంచంలో రెండో ఆటగాడిగా జడేజా నిలించాడు. అత్యంత వేగంగా 2500కు పైగా టెస్టు రన్స్, 250కిపైగా టెస్టు వికెట్లు తీసిన రికార్డు ఇంగ్లండ్ గ్రేట్ ఆల్ రౌండర్ ఇయాన్ బోథమ్ పేరు మీద ఉంది. ఇయాన్ బోథమ్ 55 టెస్ట్ ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించారు. 62 టెస్టులు ఆడిన రవీంద్ర జడేజా.. 24.42 సగటుతో 250 వికెట్లు పడగొట్టాడు. 37.04 సగటుతో 2,593 పరుగులు చేశాడు. జడేజా కంటే ముందు టీమిండియా తరుఫున కపిల్ దేవ్ (5,248 పరుగులు, 434 వికెట్లు), అనిల్ కుంబ్లే (2,506 రన్స్, 619 వికెట్లు), రవిచంద్రన్ అశ్విన్ (3,066 రన్స్, 460 వికెట్లు) ఈ ఫీట్ సాధించారు. అయితే వీరందరి కంటే వేగంగా జడేజా ఈ రికార్డు నెలకొల్పాడు.

ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది ఆసీస్. గత మ్యాచ్‌లో కంటే ఈసారి కంగారూ బ్యాట్స్‌మెన్ ఎక్కువసేపు క్రీజ్‌లో ఉండేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. టీమిండియా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. 9 వికెట్ల నష్టానికి 246 పరుగులకు చేసింది. ప్రస్తుతం హ్యాండ్స్‌కాంబ్ (62) ఒంటరి పోరాటం చేస్తున్నాడు. ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (81) రాణించగా.. కెప్టెన్ కమ్మిన్స్ (33) పర్వాలేదనిపించాడు. మరోసారి స్పిన్నర్లు ఆధిపత్యం చలాయించగా.. షమీ కూడా చెలరేగాడు. అశ్విన్, జడేజా, షమీ చెరో మూడు వికెట్లు తీశారు.  

Also Read: CM KCR Birthday: సీఎం కేసీఆర్ బర్త్ డే వేడుకల్లో అపశ్రుతి.. కిందపడిపోయిన ఎమ్మెల్యే  

Also Read: Interest Free Loan: ఈ రాష్ట్ర రైతులకు గుడ్‌న్యూస్.. రూ.5 లక్షల వరకు వడ్డీలేని రుణం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Read More