Home> క్రీడలు
Advertisement

CSK in IPL 2020: పదేళ్ల తర్వాత ఆ సీన్ రిపీట్.. చెన్నై మళ్లీ సత్తా చాటుతుందా?

శనివారం రాత్రి జరిగిన 25వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) 37 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్  (Chennai Super Kings)పై విజయం సాధించడం తెలిసిందే. ఆ మ్యాచ్ తర్వాత కొత్త వాదనలు తెరపైకి వచ్చాయి.

CSK in IPL 2020: పదేళ్ల తర్వాత ఆ సీన్ రిపీట్.. చెన్నై మళ్లీ సత్తా చాటుతుందా?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020)లో భాగంగా శనివారం రాత్రి జరిగిన 25వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) 37 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్  (Chennai Super Kings)పై విజయం సాధించడం తెలిసిందే. దీంతో ఐపీఎల్ 2020లో సీఎస్కే జట్టుకు ఇది 5వ ఓటమి కాగా.. ఈ సీజన్‌లో 7 మ్యాచ్‌లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ గత 6 మ్యాచ్‌ల్లో ఏకంగా 5 మ్యాచ్‌లలో పరాజయం పాలైంది. అయితే చెన్నై టీమ్, కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఫ్యాన్స్ మాత్రం చాలా సంతోషంగా, ధైర్యంగా ఉన్నారు. 

2010 సీన్ రిపీట్ అవుతుందని ఫ్యాన్స్ నమ్మకం!
2010లోనూ సైతం చెన్నై సూపర్ కింగ్స్ తమ ఏడు మ్యాచ్‌లకుగానూ 5 మ్యాచ్‌లు ఓడిపోయింది. లీగ్ నుంచి తప్పుకునే ముప్పు ఉందని ఐపీఎల్ విశ్లేషకులు భావించారు. కానీ ఆ సీజన్‌లో అనూహ్యంగా పుంజుకున్న సీఎస్కే ఏకంగా ఐపీఎల్ 3 సరికొత్త విజేతగా అవతరించింది. ఇక అప్పటినుంచే ఐపీఎల్‌లో సీఎస్కే హవా మరింత సాగిందని చెప్పవచ్చు. ఈ సీజన్‌లోనూ ఐపీఎల్ 2010 సీన్ రిపీట్ కానుందంటూ చెన్నై జట్టు అభిమానులతో పాటు ధోనీ ఫ్యాన్స్ ఇంకా కాన్ఫిడెన్స్‌గా ఉన్నారు. తమ జట్టుపై నమ్మకాన్ని చాటుకుంటున్నారు.

కాగా, దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ ( 90 పరుగులు నాటౌట్; 52 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులు), ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్ (33 పరుగులు; 34 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆర్సీబీ 4 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. 170 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ధోనీ సేన 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 132 పరుగులే చేసింది. దీంతో 37 పరుగుల తేడాతో ధోనీ సేనపై విరాట్ కోహ్లీ సేన తమ నాలుగో విజయాన్ని అందుకుంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Read More