Home> క్రీడలు
Advertisement

Ind vs NZ Semifinal Preview: తొలి సెమీస్‌కు రంగం సిద్ధం, ఇండియా ప్రతీకారం తీర్చుకుంటుందా, వాంఖడే పిచ్ ఎలా ఉంటుంది

Ind vs NZ Semifinal Preview: మెన్ ఇన్ బ్లూ వర్సెస్ బ్లాక్. ఐసీసీ ప్రపంచకప్ 2023లో తొలి సెమీస్ పోరుకు మరి కొద్దిగంటలే మిగిలుంది. ఇండియా జైత్రయాత్ర కొనసాగిస్తుందా, నాటి ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటుందా లేదా..

Ind vs NZ Semifinal Preview: తొలి సెమీస్‌కు రంగం సిద్ధం, ఇండియా ప్రతీకారం తీర్చుకుంటుందా, వాంఖడే పిచ్ ఎలా ఉంటుంది

Ind vs NZ Semifinal Preview: ప్రపంచకప్ 2023లో తొలి సెమీస్ పోరుకు ముంబై వాంఖడే స్డేడియం సిద్ధమైంది. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య రసవత్తర పోరు మరి కాస్సేపట్లో ప్రారంభం కానుంది. లీగ్ దశలో భారత్ వరుస విజయాలతో దూసుకుపోతున్నా..ప్రత్యర్ధి న్యూజిలాండ్ కావడంతో ఎక్కడో గుబులు రేగుతోంది. నాటి ప్రతీకారం తీర్చుకుంటుందని ప్రతి క్రికెట్ అభిమాని ఆశిస్తున్నాడు. 

ప్రపంచకప్ 2023లో టీమ్ ఇండియా అద్బుత ప్రదర్శన ఇంకా కొనసాగుతుందా లేదా నాటి ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటుందా ఆనేది ఆసక్తిగా మారింది. అటు పేసర్లు, స్పిన్నర్లు, ఇటు బ్యాటర్లు అద్భుతంగా రాణిస్తూ 9 విజయాలతో దూసుకుపోతున్న టీమ్ ఇండియాకు ఎప్పటిలానే కివీస్ కళ్లెం వేస్తుందా అనే సందేహాలు కూడా వస్తున్నాయి. 2019 వన్డే ప్రపంచకప్ సెమీపైనల్స్‌లో టీమ్ ఇండియా న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది. అందుకే ఆ ఓటమికి ఇప్పుడు ఇండియా ప్రతీకారం తీర్చుకోవాలనే కసితో ఉందని తెలుస్తోంది. 

వాంఖడే స్డేడియం పిచ్ ఎలా ఉంటుంది

మరి కాస్సేపట్లో తొలి సెమీస్ పోరు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనున్న ముంబై వాంఖడే స్డేడియం వాస్తవానికి ఇద్దరికీ అనుకూలమే. అందుకే టాస్ ఇక్కడ పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చు. ఎందుకంటే గతంలో టాస్ గెలిచిన జట్టు 15 సార్లు నెగ్గితే, టాస్ ఓడిన జట్టు 12 సార్లు గెలిచింది. అయితే టాస్ గెలిస్తే మాత్రం బ్యాటింగ్ తీసుకోడానికే ఆసక్తి చూపిస్తాయి. నెమ్మదిగా బౌలర్లకు అనుకూలించే పిచ్ ఇది. భారీ స్కోర్లు కూడా నమోదవుతుంటాయి. 

వాంఖడే గ్రౌండ్‌లో ఈసారి భారీ స్కోర్లు నమోదయ్యాయి. మొదటి మూడు మ్యాచ్‌లలో 350కు పైగా పరుగులు సాధించిన పరిస్థితి. ముంబైలో ఈసారి ప్రపంచకప్‌లో రెండవ చేజింగ్ జట్టు గెలవడం ఆస్ట్రేలియా వర్సెస్ ఆప్ఘనిస్తాన్ మ్యాచ్‌లో జరిగింది. ఈ పిచ్‌పై అత్యదిక స్కోరు 438 పరుగులు. అత్యధిక ఛేజింగ్ స్కోరు 292 పరుగులుగా ఉంది. 

వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఇండియాకు ఇది 8వ సెమీఫైనల్. 1983లో ఇంగ్లండ్‌పై , 2003లో కెన్యాపై, 2011లో పాకిస్తాన్‌పై గెలవగా, 1987లో ఇంగ్లండ్ చేతిలో, 1996లో శ్రీలంక చేతిలో 2015లో ఆస్ట్రేలియా చేతిలో 2019లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది.

ఇక న్యూజిలాండ్ జట్టుకు ఇది 9వ సెమీపైనల్. 2015లో దక్షిణాఫ్రికాపై 2019లో ఇండియాపై గెలవగా 1975లో వెస్టిండీస్‌పై 1979లో ఇంగ్లండ్ చేతిలో 1992లో పాకిస్తాన్‌తో, 1999లో మళ్లీ పాకిస్తాన్‌తో, 2007లో శ్రీలంక చేతిలో 2011లో శ్రీలంక చేతిలో ఓడిపోయింది. 

ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ బలాబలాలు

ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్లు ఇప్పటివరకూ 117 వన్డేలు ఆడగా 59 మ్యాచ్‌ల్లో ఇండియా గెలిస్తే 50 మ్యాచ్‌లలో కివీస్ విజయం సాధించింది. వాంఖడే స్డేడియంలో ఇండియా ఇప్పటి వరకూ ఐదుసార్లు వన్డే ప్రపంచకప్ ఆడింది. మూడుసార్లు విజయం సాధిస్తే రెండుసార్లు ఓడిపోయింది. 

వన్డే ప్రపంచకప్ చరిత్రలో అయితే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్లు 9 సార్లు తలపడగా, నాలుగింట ఇండియా, ఐదింట న్యూజిలాండ్ గెలిచింది. 

టీమ్ ఇండియా జట్టు

రోహిత్ శర్మ, శుభమన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్య కుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మొహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బూమ్రా, మొహమ్మద్ సిరాజ్

న్యూజిలాండ్ జట్టు

కేన్ విలియమ్సన్, డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, మిచెల్ మార్ష్, లాథమ్, ఫిలిప్స్, చాప్‌మన్, సాన్‌ట్నర్, టీమ్ సౌథీ, ఫెర్గూన్సన్, బౌల్ట్

Also read: Ind vs Nz Match Tickets: బ్లాక్ మార్కెట్‌లో దుమ్ము రేపుతున్న ఇండియా-కివీస్ సెమీస్ మ్యాచ్ టికెట్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More