Home> క్రీడలు
Advertisement

World Cup 2023 Ind vs Aus: ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జయాపజయాలు, హెడ్ టు హెడ్ రికార్డులు ఎలా ఉన్నాయి

World Cup 2023 Ind vs Aus: ఐసీసీ ప్రపంచకప్ 2023 తుది పోరు ఒక్కటే మిగిలింది. టైటిల్ కోసం తలపడే ప్రత్యర్ధులెవరో తేలిపోయింది. రెండు సార్లు చాంపియన్‌గా నిలిచిన ఇండియా వర్సెస్ ఐదుసార్లు టైటిల్ గెలిచిన ఆస్ట్రేలియా మధ్య సమరం జరగనుంది. 

World Cup 2023 Ind vs Aus: ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జయాపజయాలు, హెడ్ టు హెడ్ రికార్డులు ఎలా ఉన్నాయి

World Cup 2023 Ind vs Aus: ప్రపంచకప్ 2023 ఫైనల్ అహ్మదాబాద్ వేదికగా నవంబర్ 19 ఆదివారం మద్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుంది. న్యూజిలాండ్‌ను ఓడించి టీమ్ ఇండియా, దక్షిణాఫ్రికాను ఓడించి ఆస్ట్రేలియా ఫైనల్స్‌లో టైటిల్ కోసం తలపడనున్నాయి. ఈ క్రమంలో రెండు జట్ల మధ్య జయాపజయాలు ఎలా ఉన్నాయి, హెడ్ టు హెడ్ రికార్డ్స్ గురించి పరిశీలిద్దాం..

వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమ్ ఇండియా ఫైనల్ పోరులో గెలిచి టైటిల్ గెలవడమే కాకుండా మొత్తం టోర్నీ క్లీన్ స్వీప్ చేసే ఆలోచనలో ఉంది. ఇక ఆస్ట్రేలియా లీగ్ దశలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుని ఆరవసారి టైటిల్ గెల్చుకునే ప్లానింగ్ చేస్తోంది. ఇప్పటి వరకూ ఇండియా, ఆస్ట్రేలియా దేశాల మధ్య 151 వన్డేలు జరిగాయి. ఇందులో టీమ్ ఇండియా  57 సార్లు గెలవగా 83 మ్యాచ్‌లలో కంగారూలు విజయం సాధించారు. పది మ్యాచ్‌లు ఫలితం లేకుండా ముగిశాయి. తాజాగా జరిగిన మూడు వరుస మ్యాచ్‌లలో ఆస్ట్రేలియాను ఇండియా మట్టి కరిపించింది. ఈ ప్రపంచకప్ లీగ్ దశలో ఒకసారి, అంతకుముందు రెండుసార్లు. 

ఆస్ట్రేలియా గెలిచిన 83 మ్యాచ్‌లలో 49 సార్లు కంగారులదే ఫస్ట్ బ్యాటింగ్ కాగా 34 సార్లు ఛేజింగ్ చేశారు. ఇక ఇండియా గెలిచిన 57 మ్యాచ్‌లలో 33 సార్లు ఛేజింగ్ అయితే 24 సార్లు ఫస్ట్ బ్యాటింగ్ చేశారు. అంటే ఛేజింగ్‌లో ఇండియా ఆస్ట్రేలియా కంటే మెరుగైన స్థితిలో ఉందనే చెప్పవచ్చు.

టీమ్ ఇండియా వన్డే ప్రపంచకప్ మ్యాచ్‌లు 94 ఆడి 63 విజయాలు నమోదు చేసింది. 29 మ్యాచ్‌లు ఓడిపోయింది. ఒక మ్యాచ్ టైగా ముగిసింది. మరొకటి ఫలితం లేదు. ఇందులో ఇండియా మొదట బ్యాటింగ్ చేసింది 37 మ్యాచ్‌లు కాగా ఛేజింగ్ 26. ప్రపంచకప్ వన్డేల్లో టీమ్ ఇండియా అత్యధిక స్కోరు 413 పరుగులు కాగా అత్యల్పం 125 పరుగులు. అత్యధిక పరుగులు సచిన్ టెండూల్కర్ అయితే అత్యధిక వికెట్లు పడగొట్టింది మొహమ్మద్ షమీ. 

ఇక వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా ఇప్పటి వరకూ 104 మ్యాచ్‌లు ఆడగా 77 గెలిచింది. 25 ఓడిపోయింది. ఒక మ్యాచ్ టై అయితే మరొకటి ఫలితం లేకుండా ముగిసింది. ఇందులో ఆస్ట్రేలియా మొదటి బ్యాటింగ్ చేసింది 48 కాగా, ఛేజింగ్ 29 ఉన్నాయి. ఆస్ట్రేలియా అత్యధిక స్కోరు 417పరుగులు కాగా అత్యల్పం 129 పరుగులు. అత్యధిక పరుగులు రికీ పాంటింగ్ అయితే అత్యధిక వికెట్లు గ్లెన్ మెక్‌గ్రాత్ సాధించాడు.ప్రస్తుతం మాత్రం మిచెల్ స్టార్క్ ఉన్నాడు. 

Also read: SA Vs AUS Highlights: చెదిరిన సఫారీ కల.. ఫైనల్‌లోకి దూసుకొచ్చిన ఆస్ట్రేలియా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More