Home> క్రీడలు
Advertisement

ICC Test Rankings: టెస్టుల్లో నెం.1 టీమ్‌గా భారత్.. పాకిస్థాన్ ర్యాంక్ ఎంతంటే..?

Team India ICC Test Ranking: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా నెం.1 ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. టాప్‌ ప్లేస్‌లో ఉన్న ఆసీస్‌ను వెనక్కి నెంబర్ వన్ స్థానాన్ని ఛేజిక్కించుకుంది. ప్రస్తుతం భారత్ ఖాతాలో 115 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. కివీస్‌పై వన్డే సిరీస్ క్లీన్‌స్వీప్ చేస్తే.. వన్డేల్లోనూ టాప్‌ ప్లేస్‌కు చేరుకుంటుంది.

ICC Test Rankings: టెస్టుల్లో నెం.1 టీమ్‌గా భారత్.. పాకిస్థాన్ ర్యాంక్ ఎంతంటే..?

Team India ICC Test Ranking: టీమిండియా మళ్లీ నెంబర్ వన్ జట్టుగా అవతరించింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో భారత్ తొలి స్థానానికి చేరుకుంది. ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి టీమిండియా ఈ ఘనత సాధించింది. భారత్ 115 పాయింట్లతో మొదటి స్థానంలో ఉండగా.. ఆస్ట్రేలియా 111 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయింది. ఇటీవల బంగ్లాపై 2-0 తేడాతో టెస్ట్ సిరీస్‌ను గెలుచుకోవడంతో నెంబర్ వన్ ర్యాంక్ భారత్ సొంతమైంది. 

106 పాయింట్లతో ఇంగ్లండ్ మూడో స్థానంలో, 100 పాయింట్లతో న్యూజిలాండ్ నాలుగో స్థానంలో, 85 పాయింట్లతో దక్షిణాఫ్రికా ఐదో స్థానంలో ఉన్నాయి. వెస్టిండీస్ 79 పాయింట్లతో ఆరో స్థానంలో, 77 పాయింట్లతో పాకిస్థాన్ ఏడో స్థానంలో, 71 పాయింట్లతో శ్రీలంక ఎనిమిదో స్థానంలో, 46 పాయింట్లతో బంగ్లాదేశ్ తొమ్మిదో స్థానంలో, 25 రేటింగ్ పాయింట్లతో జింబాబ్వే 10వ స్థానంలో ఉన్నాయి.

టీ20ల్లో ఇప్పటికే టీమిండియా ఫస్ట్ ర్యాంక్‌లో ఉంది. న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌ను 3-0 తేడాతో గెలిస్తే.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా నంబర్‌వన్‌గా నిలిచే  అవకాశం ఉంది. ప్రస్తుతం వన్డే ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్ జట్టు 117 పాయింట్లతో నంబర్ వన్ స్థానంలో ఉండగా.. టీమిండియా 110 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఈ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేస్తే భారత్ ఖాతాలో 114 పాయింట్లు, న్యూజిలాండ్ జట్టు 111 పాయింట్ల ఉంటాయి. తద్వారా టీమిండియా వన్డేల్లోనూ మొదటిస్థానానికి చేరుకుంటుంది. 

త్వరలో భారత జట్టు ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఫిబ్రవరి-మార్చిలో ఇరు దేశాల మధ్య ఈ సిరీస్ జరగనుంది. భారత్‌కు ఈ టెస్టు సిరీస్‌ కీలకం. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌లోకి ప్రవేశించాలంటే టీమిండియా కనీసం 3-1 తేడాతో కంగారులను ఓడించాలి. మరోవైపు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఆస్ట్రేలియా ఫైనల్ చేరడం ఖాయమైంది. అయితే ఈ సిరీస్ తర్వాత టీమిండియా ఫైనల్స్‌కు చేరుకుంటుందా లేదా అన్నది తేలనుంది. 

ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ టేబుల్ పాయింట్లను పరిశీలిస్తే.. ప్రస్తుతం భారత్ రెండోస్థానంలో ఉంది. మూడో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా ఫైనల్ రేసుకు గట్టి పోటీ ఇస్తోంది. ఆస్ట్రేలియాపై టెస్ట్ సిరీస్‌ను భారత్ గెలిస్తే.. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరడమే కాకుండా ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌ను మరింత పటిష్టం చేసుకుంటుంది.

Also Read: Comedian Ali: పవన్ కళ్యాణ్‌పై పోటీకి సిద్ధం.. నటుడు అలీ సంచలన వ్యాఖ్యలు

Also Read: Telangana Teacher Posts: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో 23 వేల టీచర్ పోస్టులు..!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More