Home> క్రీడలు
Advertisement

ICC T20 Rankings: 40 స్థానాలను ఎగబాకిన దీపక్‌ హుడా.. టాప్ 10లో ఒక్క ఇండియన్ ప్లేయర్ లేడు!

Deepak Hooda jumped 40 places and reached Top 100 in the latest ICC T20 Rankings. టీమిండియా క్రికెటర్‌ దీపక్ హుడా ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌ 2023లో టాప్ 100లోకి ఎంట్రీ ఇచ్చాడు. 
 

ICC T20 Rankings: 40 స్థానాలను ఎగబాకిన దీపక్‌ హుడా.. టాప్ 10లో ఒక్క ఇండియన్ ప్లేయర్ లేడు!

Deepak Hooda Re-Entered Top 100 in the latest ICC T20 Rankings: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా టీ20 ఫార్మాట్‌ ర్యాంకింగ్స్ విడుదల చేసింది. టీమిండియా క్రికెటర్‌ దీపక్ హుడా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్ 100లోకి ఎంట్రీ ఇచ్చాడు. శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో హుడా 23 బంతుల్లో 41 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దాంతో 40 స్థానాలను ఎగబాకాడు. అద్భుత ఇన్నింగ్స్‌తో టీ20 ఫార్మాట్‌ బ్యాటర్ల టాప్‌ 100 జాబితాలో చోటు సంపాదించాడు. ప్రస్తుతం హుడా 374 పాయింట్లతో 97వ స్థానంలో కొనసాగుతున్నాడు. 

టీమిండియా యువ ప్లేయర్ ఇషాన్ కిషన్ కూడా 10 స్థానాలను మెరుగుపర్చుకొని.. టీ20 ఫార్మాట్‌ ర్యాంకింగ్స్‌లో 23వ ర్యాంక్‌కు చేరాడు. ఇషాన్‌ ఖాతాలో ప్రస్తుతం 567 పాయింట్లు ఉన్నాయి. లంకపై 39 పరుగులతో రాణించాడు. మిస్టర్ 360 సూర్యకుమార్‌ యాదవ్‌ టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం నిలబెట్టుకున్నాడు. సూర్య ఖాతాలో 883 పాయింట్లు ఉన్నాయి. లంకతో సిరీస్‌లో సూర్య ప్రదర్శనతో సంబంధం లేకుండా తొలి ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. పాకిస్తాన్ ఒప్నర్ మహమ్మద్ రిజ్వాన్ (836) రెండో స్థానంలో ఉన్నాడు. టాప్‌ -10లో సూర్య తప్ప మరే ఇతర భారత ఆటగాళ్లు లేరు. 

టీ20 ఫార్మాట్‌ బౌలర్ల విభాగంలో టాప్‌ -10 జాబితాలో భారత్ నుంచి ఒక్కరు కూడా లేరు. భారత్‌ నుంచి భువనేశ్వర్‌ కుమార్‌ (641) మాత్రమే 11వ ర్యాంక్‌లో ఉన్నాడు. హార్దిక్‌ పాండ్యా పది స్థానాలను మెరుగుపర్చుకొని 76వ ర్యాంక్‌ అందుకొన్నాడు. శ్రీలంక బౌలర్‌ హసరంగ (709 పాయింట్లు) అగ్ర స్థానంలో ఉండగా.. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ రషీద్ ఖాన్ (698) రెండో స్థానంలో ఉన్నాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్య (209) మూడో ర్యాంక్‌లో ఉన్నాడు. బంగ్లా కెప్టెన్ షకిబ్ అల్ హసన్ (252) టాప్‌ ర్యాంక్‌లో ఉన్నాడు.

Also Read: Car Discount Offers: మారుతి సుజుకి బంపర్ ఆఫర్.. ఈ మూడు కార్లపై 65 వేల తగ్గింపు! లిమిటెడ్ ఆఫర్   

Also Read: Cheapest Diesel Cars: సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ కార్ల కంటే బెటర్ ఆప్షన్ .. 8 లక్షల కంటే తక్కువ ధరలో 3 డీజిల్ కార్లు!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

Read More