Home> క్రీడలు
Advertisement

ICC ODI Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో దుమ్మురేపిన పంత్‌.. 25 స్థానాలు ఎగబాకిన హార్దిక్!

Rishabh Pant jumps 25 places in ICC ODI rankings. ఐసీసీ విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో రిషబ్ పంత్‌ ఏకంగా 25 స్థానాలు ఎగబాకి.. 52వ స్థానానికి చేరుకున్నాడు.
 

ICC ODI Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో దుమ్మురేపిన పంత్‌.. 25 స్థానాలు ఎగబాకిన హార్దిక్!

Rishabh Pant jumps 25 places in ICC ODI rankings: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ర్యాంకింగ్స్‌లో టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ దుమ్మురేపాడు. బుధవారం ఐసీసీ విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో పంత్‌ ఏకంగా 25 స్థానాలు ఎగబాకి.. 52వ స్థానానికి చేరుకున్నాడు. తాజాగా ఇంగ్లండ్‌తో ముగిసిన చివరిదైన మూడో వన్డేలో అద్బుత సెంచరీ (125 నాటౌట్‌; 113 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్సర్లు)తో చెలరేగడంతో పంత్ ర్యాంకింగ్స్‌లో ముందుకు దూసుకొచ్చాడు. కీలక నాలుగు వికెట్లు కోల్పోయిన సమయంలో క్రీజులోకి వచ్చిన పంత్.. అద్భుత ఆటతో టీమిండియాకు విజయాన్ని అందించాడు. 

బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్‌ ఆజమ్ 892 పాయింట్లతో నెంబర్‌ వన్‌ స్థానంలో ఉన్నాడు. ఇమాముల్‌ హక్‌ (815), వాండర్‌ డుసెన్‌ (796) 2,3 స్థానాల్లో ఉన్నారు. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్‌ కోహ్లీ ఒక స్థానం దిగజారి.. నాలుగో స్థానంకు పడిపోయాడు. కోహ్లీ ఖాతాలో 790 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. భారత సారథి రోహిత్‌ శర్మ (786) 5వ స్థానంలో ఉన్నాడు. టాప్ 10లో కోహ్లీ, రోహిత్ తప్ప మేరె ఇతర ప్లేయర్ లేరు. 

ఇంగ్లండ్‌పై హాఫ్ సెంచరీ (71; 55 బంతుల్లో 10 ఫోర్లు) చేసిన హార్దిక్ పాండ్యా కూడా 8 స్థానాలు వన్డే ర్యాంకింగ్స్‌లో సత్తాచాటాడు. 8 స్థానాలు ఎగబాకి 42వ స్థానంలో నిలిచాడు. వన్డేలో కెరీర్‌ బెస్ట్‌ నమోదు చేసిన హార్దిక్ (4/24) బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో 25 స్థానాలు ఎగబాకి.. 70వ స్థానానికి చేరుకున్నాడు. మణికట్టు యుజ్వేంద్ర చహల్‌ నాలుగు స్థానాలు ఎగబాకి 16వ స్థానంలో నిలిచాడు. ఇక గాయంతో మూడో వన్డేకు దూరమైన స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా నెంబర్‌ వన్‌ స్థానాన్ని కోల్పోయాడు. కివీస్ పేసర్ ట్రెంట్‌ బౌల్ట్‌ టాప్‌లో నిలిచాడు. ఆల్‌రౌండర్ విభాగంలో షకీబ్‌ అల్‌ హసన్‌ తొలి స్థానంలో నిలిచాడు. 

Also Read: మెట్రో స్టేషన్‌లో అందమైన యువతి డ్యాన్స్‌.. నిమిషాల్లో వైరల్ అయిన వీడియో!

Also Read: ఒత్తిడి లేకుండా ఆడండి.. సంబరాలు చేసుకుందాం! భారత అథ్లెట్లలో స్ఫూర్తి నింపిన ప్రధాని

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Read More