Home> క్రీడలు
Advertisement

ICC Rankings 2023: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా సత్తా.. మూడు ఫార్మాట్లలో మనమే టాప్..!

Indian Players in ICC Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా సత్తా చాటింది. మూడు ఫార్మాట్లలోనూ భారత్ నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. సూర్యకుమార్ యాదవ్, రవి బిష్టోయ్ టీ20 నెంబర్ వన్ బ్యాట్స్‌మెన్, బౌలర్‌గా నిలిచారు. పూర్తి వివరాలు ఇలా..
 

ICC Rankings 2023: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా సత్తా.. మూడు ఫార్మాట్లలో మనమే టాప్..!

Indian Players in ICC Rankings: గత పదేళ్లుగా టీమిండియా ఐసీసీ ట్రోఫీని గెలవలేకపోయినా.. భారత ఆటగాళ్లు మాత్రం అద్భుతంగా రాణిస్తున్నారు. ఇటీవల ముగిసిన వరల్డ్ కప్‌లో కూడా ఫైనల్‌ మ్యాచ్ మినహాఅన్ని మ్యాచ్‌ల్లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చారు. వరల్డ్ కప్ ఓటమి నుంచి ఇంకా భారత అభిమానులు మర్చిపోలేకున్నారు. ఆసీస్‌పై టీ20 సిరీస్‌ను 4-1 తేడాతో గెలవడంతో కాస్త ఊరట కలిగింది. ఇక తాజాగా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మనోళ్లు దుమ్ములేపారు. టీ20, వన్డే, టెస్టుల్లో టాప్‌ ర్యాంక్‌లు సాధించారు. జట్టు కూడా మూడు ఫార్మాట్‌లో నెంబర్ వన్‌ ప్లేస్‌లో నిలిచింది. 

టీ20ల్లో ఇలా..

టీ20 ఫార్మాట్‌లో భారత్‌కు 265 రేటింగ్ పాయింట్లు ఉండగా.. 259 రేటింగ్ పాయింట్లతో ఇంగ్లాండ్ రెండోస్థానంలో ఉంది. న్యూజిలాండ్ 3వ స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా నాలుగో స్థానంలో ఉంది. టీ20 నెంబర్ వన్‌ బ్యాట్స్‌మెన్‌గా టీమిండియా నయా 360 తన స్థానాన్ని నిలుపుకున్నాడు. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో రవి బిష్ణోయ్ టాప్ ర్యాంక్ కొట్టేశాడు. ఇటీవల ఆసీస్‌ సిరీస్‌లో బిష్టోయ్ సూపర్‌గా బౌలింగ్ చేశాడు. రుతురాజ్ గైక్వాడ్ కూడా ఏడో స్థానంలో ఉండగా.. ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్‌లో హార్దిక్ పాండ్యా మూడో స్థానంలో ఉన్నాడు.

వన్డే ర్యాంకింగ్స్‌లో ఇలా..

వన్డేల్లో 121 రేటింగ్ పాయింట్లతో టీమిండియా టాప్ ప్లేస్‌ను నిలుపుకుంది. 117 రేటింగ్ పాయింట్లతో ఆస్ట్రేలియా రెండోస్థానంలో కొనసాగుతోంది. దక్షిణాఫ్రికా 110 రేటింగ్‌తో మూడో స్థానంలో, పాకిస్థాన్ (109) నాలుగో స్థానంలో ఉన్నాయి. బ్యాట్స్‌మెన్‌లలో శుభ్‌మన్ గిల్ అగ్రస్థానంలో ఉన్నాడు. బాబర్ అజామ్ 2, విరాట్ కోహ్లీ మూడో స్థానంలో ఉండగా.. కెప్టెన్ రోహిత్ శర్మ నాలుగో స్థానంలో ఉన్నాడు. బౌలర్లలో మహ్మద్ సిరాజ్ మూడో స్థానంలో.. జస్ప్రీత్ బుమ్రా 4, కుల్దీప్ యాదవ్ 6, మహ్మద్ షమీ 10వ స్థానంలో ఉన్నారు. ఆల్ రౌండర్ ర్యాంకింగ్స్‌లో రవీంద్ర జడేజా 10వ స్థానంలో ఉన్నాడు.

టెస్ట్ ర్యాంకింగ్స్ ఇలా..

టెస్ట్ ఫార్మాట్‌లో భారత్ 118 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. అదే రేటింగ్ పాయింట్లతో ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉంది. భారత్ కంటే ఆస్ట్రేలియా ఒక మ్యాచ్ ఎక్కువ ఆడి అన్నే పాయింట్లు సాధించడంతో రెండోస్థానంలో నిలిచంది. పాకిస్థాన్‌తో జరిగే టెస్ట్ మ్యాచ్‌లో ఆసీస్ గెలిస్తే నెంబర్ వన్ ర్యాంక్‌కు చేరుకుంటుంది. దక్షిణాఫ్రికా పర్యటనలో భారత్ మెరుగైన ప్రదర్శన చేస్తే టాప్ ప్లేస్ నిలబడుతుంది. కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌‌లో 10వ స్థానంలో ఉన్నాడు. బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. రవీంద్ర జడేజా మూడో స్థానంలో ఉన్నాడు. ఆల్ రౌండర్ ర్యాంకింగ్స్‌లో రవీంద్ర జడేజా మొదటి స్థానంలో, రవిచంద్రన్ అశ్విన్ రెండో స్థానంలో ఉన్నారు. అక్షర్ పటేల్ కూడా ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియాకు చెందిన 18 మంది ఆటగాళ్లు టాప్ 10లో కొనసాగుతున్నారు. వీరిలో ఐదుగురు ఆటగాళ్లు టాప్ ప్లేస్‌లో ఉన్నారు.  భారత జట్టు మూడు ఫార్మాట్లలో అగ్రస్థానంలో ఉంది.

Also Read:  Revanth Reddy: ఇదే నా ఆహ్వానం.. ప్రజలకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

Also Read:  Chennai Floods: చెన్నై వరదలపై డేవిడ్ వార్నర్ ఆందోళన, సహాయం కోసం పిలుపు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More