Home> క్రీడలు
Advertisement

GT vs LSG: ఐపీఎల్‌లో తొలిసారి బరిలోకి గుజరాత్, లక్నో.. ఇరు జట్లలో గేమ్ ఛేంజర్స్‌ వీరే! ఇక డబిడదిబిడే!

GT vs LSG IPL 2022 Game Changers: ఐపీఎల్ 2022లో భాగంగా మరికొద్దిసేపట్లో ముంబైలోని వాంఖడే స్టేడియంలో కొత్త జట్లు ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌, గుజ‌రాత్ టైటాన్స్ తలపడనున్నాయి. ఇరు జట్లలో గేమ్ ఛేంజర్స్‌ ఉన్నారు. 

GT vs LSG: ఐపీఎల్‌లో తొలిసారి బరిలోకి గుజరాత్, లక్నో.. ఇరు జట్లలో గేమ్ ఛేంజర్స్‌ వీరే! ఇక డబిడదిబిడే!

Hardik Pandya, KL Rahul and Rashid Khan is Game Changers for GT vs LSG IPL 2022 Match 4: ఐపీఎల్ 2022లో భాగంగా మరికొద్దిసేపట్లో ముంబైలోని వాంఖడే స్టేడియంలో కొత్త జట్లు ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌, గుజ‌రాత్ టైటాన్స్ తలపడనున్నాయి. టాస్ రాత్రి 7 గంటలకు పడనుండగా.. 7.30కు మ్యాచ్ ఆరంభం కానుంది. ఐపీఎల్‌లో తొలిసారి ల‌క్నో, గుజ‌రాత్ జట్లు తలపడనున్న నేపథ్యంలో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్‌కి ఇదివరకే సారథ్య అనుభవం ఉండగా.. గుజ‌రాత్ సారథి హార్దిక్ పాండ్యాకి ఇదే మొదటిసారి. ఇరు జట్లలో గేమ్ ఛేంజర్స్‌ ఉన్నారు. వారెవరో ఓసారి చూద్దాం. 

కేఎల్ రాహుల్:
కేఎల్ రాహుల్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. భారత జట్టులోని మూడు ఫార్మాట్లలో ఆడుతున్న రాహుల్.. ఐపీఎల్ టోర్నీలో కూడా పరుగుల వరద పారిస్తున్నాడు. గత నాలుగు ఏళ్లుగా పంజాబ్ కింగ్స్ జట్టుకు సారథిగా ఉన్న ఈ కర్ణాటక బ్యాటర్.. ఈసారి లక్నో  సూప‌ర్ జెయింట్స్‌ జట్టుకు ఆడనున్నాడు. చాలా సీజన్లలో నిలకడగా అద్భుత ప్రదర్శన చేశాడు. ఇక ఐపీఎల్ 2021లో 626 పరుగులు చేసి టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఓపెనర్‌గా వచ్చే రాహుల్.. ఒక్క ఓవర్లోనే మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేస్తాడు.  

క్వింటన్ డికాక్:
చాలా ఏళ్లుగా ముంబై ఇండియన్స్ జట్టులో ఆడిన దక్షిణాఫ్రికా స్టార్ ప్లేయర్ క్వింటన్ డికాక్.. ఈసారి లక్నోలో ఆడనున్నాడు. డికాక్ తన అద్భుతమైన బ్యాటింగ్‌తో బౌలర్లను బయపెట్టగలడు. ముఖ్యంగా పవర్ ప్లేలో బౌండరీల వర్షం కురిపించగలడు. ఓపెనర్‌గా జట్టుకు మంచి ఆరంభాలు ఇస్తాడు. తుఫాన్ ఇన్నింగ్స్‌లు కూడా ఆడగలడు. దాంతో మిగతా వారిపై ఒత్తిడి తగ్గుతుంది. ఐపీఎల్ చివరి సీజన్‌లో 11 మ్యాచ్‌ల్లో 297 పరుగులు చేశాడు. 

హార్దిక్ పాండ్యా: 
టీమిండియా ప్లేయర్ హార్దిక్ పాండ్యా గురించి అభిమానులకు పరిచయం అక్కర్లేదు. బ్యాటింగ్, బౌలింగ్‌తో జట్టుకు ఒంటిచేత్తో విజయాలు అందించగలడు. ఒకే ఓవర్లో భారీ సిక్సులు బాదుతూ మ్యాచ్ ఫలితాన్నే మార్చగలడు.  అయితే గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్.. గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌ తర్వాత ఫిట్‌నెస్‌ సమస్యలతో చాలా కాలంగా మైదానానికి దూరంగా ఉన్నాడు. ఇదొక్కటే కాస్త కలవరపెట్టే అంశం. గత సీజన్‌లో పాండ్యా 12 మ్యాచ్‌ల్లో 127 పరుగులు మాత్రమే చేశాడు. ఫిట్‌నెస్ కారణంగా అతను బౌలింగ్ చేయలేకపోయాడు. ఈసారి మాత్రం బౌలింగ్ చేస్తానని చెప్పాడు. 

రషీద్ ఖాన్:
ఆఫ్గనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ గురించి తెలిసిందే. ఐపీఎల్ టోర్నీలో అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకడు. మేటి బ్యాటర్లను సైతం తన స్పిన్ ఉచ్చులో పడేయగలడు. రషీద్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి స్టార్ ఆటగాళ్లు కూడా ఆచితూచి ఆడుతారు. పరుగులు ఇవ్వడంలో పిసినారి. ఒకే ఓవర్లో 2-3 వికెట్లు కూడా తీయగలడు. చాలా ఏళ్లు హైదరాబాద్‌ జట్టులో భాగంగా ఉన్న రషీద్.. ఈసారి గుజరాత్ తరపున ఆడనున్నాడు. గత సీజన్‌లో 14 మ్యాచ్‌ల్లో 18 వికెట్లు తీశాడు.

Also Read: Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్‌కి భారీ షాక్.. మరో స్టార్ ప్లేయర్ ఔట్!!

Also Read: PBKS vs RCB Records: అరుదైన రికార్డు నెలకొల్పిన పంజాబ్‌.. బెంగళూరు ఖాతాలో చెత్త రికార్డు!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More