Home> క్రీడలు
Advertisement

గాయాలు వేధించినా లక్ష్యాన్ని సాధించిన క్రికెటర్ ఆశిష్ నెహ్రా

2011 వన్డే ప్రపంచ కప్ విన్నర్ ఆశిష్ నెహ్రాకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. 2003 గంగూలీ కెప్టెన్సీలో ప్రపంచ కప్ ఫైనల్ చేరిన జట్టులోనూ నెహ్రా సభ్యుడేనని తెలిసిందే. 

గాయాలు వేధించినా లక్ష్యాన్ని సాధించిన క్రికెటర్ ఆశిష్ నెహ్రా

పేస్‌కు తోడు లైన్ అండ్ లెంగ్త్ బంతులకు అతడు పెట్టింది పేరు. కానీ కెరీర్‌లో ఫామ్ కన్నా గాయాలే ఎక్కువగా వేధించాయి. 12ఏళ్లు జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించినా కేవలం 164 మ్యాచ్‌లే ఆడాడు. కానీ బౌలింగ్‌లో ఎప్పుడూ తేలిపోని పేసర్. అతడు మరెవరో కాదు  భారత మాజీ క్రికెటర్ ఆశిష్ నెహ్రా. నేడు (ఏప్రిల్ 29న) నెహ్రా పుట్టినరోజు. 2011 వన్డే ప్రపంచ కప్ విన్నర్ ఆశిష్ నెహ్రాకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. 2003 గంగూలీ కెప్టెన్సీలో ప్రపంచ కప్ ఫైనల్ చేరిన జట్టులోనూ నెహ్రా సభ్యుడేనని తెలిసిందే.  బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మృతి

1999 ఫిబ్రవరిలో శ్రీలంక టెస్ట్ మ్యాచ్ ద్వారా జాతీయ జట్టులోకి వచ్చిన నెహ్రా.. కెరీర్‌లో కేవలం 17 టెస్టులే ఆడి 44 వికెట్లు తీశాడు. గాయాల కారణంగా టెస్టు జట్టుకు 2004లోనే దూరమయ్యాడు. 2001లో జింబాబ్వేతో తొలి వన్డే మ్యాచ్ ఆడిన ఈ పేసర్ చివరగా 2011 వన్డే ప్రపంచ కప్‌లో చివరి మ్యాచ్ ఆడాడు. 120 వన్డేలాడిన నెహ్రా 157 వికెట్లు పడగొట్టాడు. వన్డే కెరీర్‌లో రెండు పర్యాయాలు 5కు పైగా వికెట్లు సాధించాడు. 27 టీ20లాడిన నెహ్రా.. 34 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.  ఏపీలో తాజాగా 73 మందికి కరోనా.. 3 జిల్లాల్లో అలర్ట్

ప్రపంచ కప్‌లలో కేవలం 20.54సగటుతో బౌలింగ్ చేసిన అరుదైన బౌలర్ల జాబితాలోనూ స్థానం దక్కించుకున్నాడు నెహ్రా. ఒకప్పుడు నెహ్రా కెప్టెన్సీలో ఢిల్లీ జట్టులోకి వచ్చాడు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ. అనంతర కాలంలో కోహ్లీ కెప్టెన్సీలో భారత్‌కు ఆడాడు ఈ వెటరన్ క్రికెటర్. కెరీర్‌లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ (టీ20) నవంబర్ 1, 2017లో న్యూజిలాండ్‌తో ఆడాడు. సొంత మైదానం ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లాలో మ్యాచ్‌తోనే క్రికెట్‌కు వీడ్కోలు పలకడం విశేషం. Photos: పెళ్లి తర్వాత నటి గ్లామర్ షో!

భారత క్రికెట్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఆటగాళ్లలో సాధారణ జీవితం గడిపిచిన అతికొద్ది మందిలో నెహ్రా ఒకడని చెప్పవచ్చు. సోషల్ మీడియాలో ఉండడు. కనీసం స్మార్ట్ ఫోన్ వాడకుండా బేసిక్ మోడల్ మొబైల్ వాడేవాడు. దుబారా ఖర్చులకు దూరంగా ఉండాలని సూచించేవాడు. నిరంతరం క్రికెట్, కుటుంబం గురించి మాత్రమే ఆలోచించేవాడని అతడితో పాటు ఆడిన భారత క్రికెటర్లు తరచుగా చెబుతుండేవారు..  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!

 ‘అల వైకుంఠపురములో’ భామ Hot Photos

Read More