Home> క్రీడలు
Advertisement

Dhoni Birthday: ధోనీ బర్త్‌ డే విషెస్‌తో హోరెత్తుతున్న ట్విట్టర్

Happy Birthday Dhoni | టీమిండియా సక్సెస్ ఫుల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పుట్టినరోజు నేడు. మహీ బర్త్ డేను పురస్కరించుకుని శుభాకాంక్షలు వెల్లువ మొదలైంది. ధోనీకి బర్త్ డే విషెస్ ట్వీట్లతో ట్విట్టర్ నిండిపోతోంది. 2019 వన్డే వరల్డ్ కప్ ఓటమి అనంతరం ధోనీ మళ్లీ మైదానంలోకి కాలు పెట్టలేదు.

Dhoni Birthday: ధోనీ బర్త్‌ డే విషెస్‌తో హోరెత్తుతున్న ట్విట్టర్

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) నేడు (జులై 7న) 39వ వసంతంలోకి అడుగుపెట్టాడు. భారత క్రికెట్ జట్టుకు అద్భుతమైన విజయాలు అందించిన ధోనీకి పుట్టినరోజు శుభాకాంక్షలు (Happy Birthday Dhoni)తో సోషల్ మీడియా హోరెత్తుతోంది. 2007లో టీ20 ప్రపంచ కప్, 2011లో వన్డే వరల్డ్ కప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ అందించాడు. ఈ మూడు ఐసీసీ ట్రోఫీలను జట్టుకు అందించిన ఏకైక కెప్టెన్ ధోనీనే కావడం గమనార్హం. దేశాన్ని అన్ని ఐసీసీ ఈవెంట్లలో సగర్వంగా తలెత్తుకునేలా చేసిన ధోనీ జార్ఖండ్ రాజధాని రాంచీలో 1981లో జులై 7న జన్మించాడు.  IPL 2020: ఐపీఎల్ రద్దయితే భారీ నష్టం..

2004లో అప్పటి కెప్టెన్ సౌరవ్ గంగూలీ జాతీయ జట్టులోకి ఎంఎస్ ధోనీకి అవకాశం ఇచ్చాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి వన్డేలో లేని పరుగు కోసం ప్రయత్నంచి ధోనీ రనౌటయ్యాడు. ఆ తర్వాత పాకిస్థాన్‌తో జరిగిన సిరీస్‌లో అవకాశం రావడంతో విశాఖ వేదికగా ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. రాహుల్ ద్రావిడ్ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న మహీ.. 2007లో తొలి టీ20 వరల్డ్ కప్‌ను తన చాతుర్యంతో గెలిపించాడు.  RGV సెక్సీ హీరోయిన్ Apsara Rani హాట్ ఫొటోలు వైరల్
 

1983 తర్వాత 28 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ 2011లో వన్డే ప్రపంచ కప్‌ను అందించాడు. దీంతో ధోనీ నాయకత్వ లక్షణాలపై ఎనలేని విశ్వాసం కలగడంతో పాటు ప్రపంచం మొత్తం ధోనీ ది గ్రేట్ అంటూ ప్రశంసలతో ముంచెత్తింది. 2013లో శిఖర్ ధావన్, రోహిత్ శర్మల జోడీని సక్సెస్ బాటలో నిలిపి తన సారథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీని సైతం ధోనీ అందించాడు. 

మరుసటి ఏడాది 2015 వన్డే ప్రపంచ కప్ ఉన్న తరుణంలో 2014లో టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ వన్డే, టీ20లలో కొనసాగుతున్నాడు. చివరగా 2019 వన్డే ప్రపంచ కప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీపైనల్‌లో భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. వరల్డ్ కప్ ఓటమి తర్వాత జట్టుకు దూరంగా ఉన్న ధోనీ ఈ క్రమంలో ఏకంగా బీసీసీఐ కాంట్రాక్ట్ సైతం కోల్పోయాడు. మధ్యలో సైన్యంతో పాటు కొన్ని రోజులు సరిహద్దుల్లో గడిపి సేవలందించాడు.

ఐపీఎల్ 2020లో రాణించి జట్టులోకి రీఎంట్రీ ఇవ్వాలనుకున్న ధోనీకి నిరాశే ఎదురైంది. ఈ ఏడాది ఐపీఎల్‌పై ఏ స్పష్టత లేదు. విజయవంతమైన కెప్టెన్‌గా, సక్సెస్‌ఫుల్ ఫినిషర్‌గా, బెస్ట్ వికెట్ కీపర్‌గా జట్టుకు సేవలందించిన ధోనీ కెరీర్ ప్రశ్నార్థకంలో పడింది.  జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..   
RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos
  

Read More