Home> క్రీడలు
Advertisement

England బౌలర్ జేమ్స్ అండర్సన్ అరుదైన ఘనత

ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ అరుదైన ఘనత సాధించాడు. గతంలో ఏ పేస్ బౌలర్‌కు సాధ్యంకాని అరుదైన ఫీట్‌ను తన ఖాతా (James Anderson becomes first fast bowler to pick 600 Test wickets)లో వేసుకున్నాడు. 17 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో సాధించినా.. ఇది మాత్రం అండర్సన్‌కు చాలా ప్రత్యేకం.

England బౌలర్ జేమ్స్ అండర్సన్ అరుదైన ఘనత

ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ (James Anderson) అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్‌లో 600 వికెట్లు అరుదైన మెలురాయి (James Anderson to pick 600 Test wickets)ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన తొలి పేస్ బౌలర్‌గా నిలిచాడు. పాకిస్తాన్‌తో జరిగిన రెండో టెస్టులో అండర్సన్ ఈ ఫీట్ నమోదు చేశాడు. అయితే టెస్టుల్లో ఓవరాల్‌గా అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్లలో నాలుగో స్థానంలో అండర్సర్ ఉన్నాడు. Dope Tests: ధోనీ, కోహ్లీ, రోహిత్ శర్మలకు డోపింగ్ పరీక్షలు

అండర్సన్ కన్నా అధిక వికెట్లు ముగ్గురు బౌలర్లు పడగొట్టగా, వారంతా స్పిన్నర్లే కావడం గమనార్హం. శ్రీలంక స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ 800 వికెట్లు, ఆస్ట్రేలియా స్పిన్నర్ షేన్ వార్న్ 708 వికెట్లు, భారత లెగ్ స్పినర్ అనిల్ కుంట్లే 619 టెస్టు వికెట్లు సాధించారు. త్వరలోనే కుంబ్లే అత్యధిక వికెట్ల రికార్డును ఇంగ్లాండ్ బౌలర్ అండర్సన్ అధిగమించనున్నాడు. Virat Kohli: ఆర్సీబీ ఆటగాళ్లకు విరాట్ కోహ్లీ వార్నింగ్ 

చివరి రోజు టీ విరాటం తర్వాత ఇంగ్లాండ్, పాకిస్తాన్ మూడో టెస్టు ఆట మొదలైంది. పాక్ కెప్టెన్ అజహర్ అలీ(31) ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్‌లో ఉన్న ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ అందుకోవడంతో అండర్సన్ ఖాతాలో 600వ వికెట్ చేరింది. దీంతో ఈ ఘనత సాధించిన తొలి పేస్ బౌలర్‌గా సరికొత్త చరిత్ర తన పేరిట లిఖించుకున్నాడు. వర్షం కారణంగా మ్యాచ్ సెషన్లు కోల్పోవడంతో చివరికి మూడో టెస్టు డ్రాగా ముగిసింది. పాకిస్తాన్‌పై 1-0తో టెస్ట్ సిరీస్‌ను ఇంగ్లాండ్ సొంతం చేసుకుంది. Malaika Arora Yoga Pics: నటి మలైకా అరోరా యోగా ఫొటోస్ ట్రెండింగ్ 
Effects Of Skipping Breakfast: బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే ఎన్ని నష్టాలో తెలుసా..!

Read More