Home> క్రీడలు
Advertisement

Eng Vs Pak: టెస్టుల్లో 112 ఏళ్ల రికార్డు బద్దలు.. టీ20 మ్యాచ్‌లాగా చెలరేగిన ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్

PAK vs ENG 1st Test Match: పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ రికార్డులు బద్ధలు కొట్టింది.  ఒకే రోజు 506 పరుగులు చేసిన జట్టుగా నిలిచింది. అంతేకాదు టీ20 మ్యాచ్‌ తరహాలో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ సిక్సర్లు, ఫోర్లతో చెలరేగి ఆడారు.
 

Eng Vs Pak: టెస్టుల్లో 112 ఏళ్ల రికార్డు బద్దలు.. టీ20 మ్యాచ్‌లాగా చెలరేగిన ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్

PAK vs ENG 1st Test Match: పాకిస్థాన్ బౌలర్లకు ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ చుక్కలు చూపించారు. ఆడుతోంది టెస్ట్ మ్యాచ్ అని మర్చిపోయి.. టీ20 మ్యాచ్‌లాగా బ్యాటింగ్ చేశారు. ఒకే రోజు 500 పరుగులు చేసి.. 112 ఏళ్ల రికార్డును బ్రేక్ చేశారు. ఒకే రోజు నలుగురు ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ సెంచరీలు చేసి సరికొత్త చరిత్ర సృష్టించారు. తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 75 ఓవర్లలోనే నాలుగు వికెట్ల నష్టానికి 506 పరుగులు చేసింది.

ఈ మ్యాచ్‌లో మొదట ఇంగ్లండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు జాక్ క్రాలీ (122), బెన్ డకెట్ (107) సెంచరీలతో కదం తొక్కడంతో ఇంగ్లండ్‌కు ఇన్నింగ్స్‌ మంచి పునాది పడింది. ఇద్దరు సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడుతూ.. పాకిస్థాన్ బౌలర్లను ఆడుకున్నారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 35.4 ఓవర్లలోనే 233 పరుగులు జోడించారు. ఆ తరువాత వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్ ఆలీ పోప్ (108), హ్యారీ బ్రూక్ (101) కూడా సెంచరీలతో చెలరేగడంతో ఇంగ్లండ్ భారీ స్కోరు చేసింది. 

145 ఏళ్ల చరిత్రలో ఇలా జరగడం తొలిసారి

145 ఏళ్ల చరిత్రలో టెస్టు మ్యాచ్‌లో తొలిరోజు 500 పరుగుల మార్కును దాటిన తొలి జట్టుగా ఇంగ్లండ్ జట్టు నిలిచింది. ఈ క్రమంలోనే 112 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది. టెస్టు మ్యాచ్‌లో తొలిరోజు 500 పరుగులు చేసిన తొలి జట్టుగా ఇంగ్లండ్‌ రికార్డు సృష్టించింది. అంతకుముందు 1910లో ఆస్ట్రేలియా టెస్టు తొలిరోజు 494 పరుగులు చేసింది. 112 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టి ఇంగ్లండ్‌ సరికొత్త చరిత్రను తన పేరు మీద లిఖించుకుంది.

17 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్‌ జట్టు పాకిస్థాన్‌లో టెస్టు సిరీస్‌ ఆడేందుకు వచ్చింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేయాలని తీసుకున్న నిర్ణయం సరైనదని నిరూపితమైంది. బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ ఓపెనర్లు లంచ్ విరామ సమయానికి 174 పరుగులు చేశారు. ఇది ప్రపంచ రికార్డుగా నిలిచింది. ఈ మ్యాచ్‌కు ముందు ఈ ప్రపంచ రికార్డు టీమ్ ఇండియా పేరిట ఉంది. 2018లో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన తొలి సెషన్‌లో భారత్ వికెట్లు కోల్పోకుండా 158 పరుగులు జోడించింది. ఇప్పుడు ఆ రికార్డును ఇంగ్లండ్ బ్రేక్ చేసింది. ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్‌మెన్ జో రూట్ (23) మాత్రమే తక్కువ స్కోరు చేశాడు. హ్యారీ బ్రూక్‌తో పాటు కెప్టెన్ బెన్ స్టోక్స్ (34) క్రీజ్‌లో ఉన్నారు. పాక్ బౌలర్లలో జాహీద్ మహ్మాద్ రెండు వికెట్లు, మహ్మాద్ అలీ, హరీస్ రౌఫ్ చెరో వికెట్ తీశారు.

Also Read: Iyan Griggs: వామ్మో.. టాటూలకే రూ.29 లక్షలు ఖర్చు చేసిన ఘనుడు..!  

Also Read: 32 Inches Smart TV: స్మార్ట్ టీవీపై భారీ ఆఫర్.. రూ.7 వేలకు లోపే 32 ఇంచుల టీవీ..!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Read More