Home> క్రీడలు
Advertisement

Arshdeep Singh Debut: మూడో బౌలర్‌గా అర్ష్‌దీప్‌ అరుదైన రికార్డు.. ఝులన్‌ గోస్వామి సరసన!

ENG vs IND 1st T20, Arshdeep Singh becomes 3rd Indian bowler. టీ20ల్లో అరంగేట్ర మ్యాచ్‌లోనే మెయిడెన్‌ ఓవర్ వేసిన మూడో భారత బౌలర్‌గా అర్ష్‌దీప్‌ సింగ్  రికార్డుల్లో నిలిచాడు. 
 

Arshdeep Singh Debut: మూడో బౌలర్‌గా అర్ష్‌దీప్‌ అరుదైన రికార్డు.. ఝులన్‌ గోస్వామి సరసన!

Arshdeep Singh becomes 3rd Indian bowler in T20: ఐపీఎల్ 2022లో అదరగొట్టిన టీమిండియా యువ పేసర్ అర్ష్‌దీప్‌ సింగ్ ఇంగ్లండ్‌ పర్యటనకు ఎంపికయిన విషయం తెలిసిందే. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా గురువారం రాత్రి జరిగిన తొలి టీ20 మ్యాచ్‌తో అర్ష్‌దీప్‌ అరంగేట్రం చేశాడు. టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అతడికి క్యాప్‌ అందించగా.. తొలిసారి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఆడాడు. అయితే ఐపీఎల్ ఫామ్ కొనసాగిస్తూ.. మొదటి మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.
 

ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌తో ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన అర్ష్‌దీప్‌ సింగ్.. ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. హిట్టర్ జాసన్ రాయ్ క్రీజులో ఉన్నా.. అద్భుత బంతులతో అతడిని కట్టడి చేసి మెయిడెన్‌ ఓవర్ వేశాడు. దాంతో టీ20ల్లో అరంగేట్ర మ్యాచ్‌లోనే మెయిడెన్‌ ఓవర్ వేసిన మూడో భారత బౌలర్‌గా రికార్డుల్లో నిలిచాడు. 16 ఏళ్ల క్రితం ఈ ఫీట్ నమోదు చేసిన భారత మహిళా జట్టు బౌలర్‌ ఝులన్‌ గోస్వామి, పురుషుల జట్టు పేసర్ అజిత్‌ అగార్కర్‌ సరసన నిలిచాడు. 2006లో ఇంగ్లండ్‌పై ఝులన్‌.. దక్షిణాఫ్రికాపై అగార్కర్‌ టీ20 ఫార్మాట్‌లో ఈ ఫీట్‌ నమోదు చేశారు.

ఈ మ్యాచ్‌లో అర్ష్‌దీప్‌ సింగ్‌ 3.3 ఓవర్లు వేసి 18 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లీష్ ప్లేయర్స్ రీస్‌ టోప్లే, మాథ్యూ పార్కిన్సన్‌లను అతడు అవుట్‌ చేశాడు. మొదటి ఓవర్ మెయిడెన్‌ చేసిన అర్ష్‌దీప్‌.. రెండో ఓవర్లో 11 పరుగులు ఇచ్చాడు. మూడో ఓవర్లో ఐదు పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. నాలుగు ఓవర్లో ఒక రన్ ఇచ్చి మరో వికెట్ పడగొట్టాడు. దాంతో అతడిపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఐపీఎల్‌ 2022లో పంజాబ్‌ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన అర్ష్‌దీప్‌.. 14 ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టిన విషయం తెలిసిందే. 

Also Read: Bhuvneshwar Inswinger: వాట్ ఏ బౌలింగ్ భువనేశ్వర్.. అద్భుత ఇన్‌స్వింగర్‌కు బిత్తరపోయిన బట్లర్‌!  

Also Read: Good luck tips: మీరు దారిలో ఈ 5 దృశ్యాలు చూస్తే... మీ కెరీర్ కు తిరుగుండదు!

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Read More