Home> క్రీడలు
Advertisement

Dinesh Karthik: భారత జట్టులో ఆడాలనే కసి ఇంకా ఉంది.. ఇప్పుడప్పుడే రిటైర్మెంట్‌ ప్రకటించేదిలే: డీకే

టీమిండియా సీనియర్‌ బ్యాటర్, వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌ తన మనసులోని మాటను మరోసారి బయటపెట్టాడు. తనకు భారత జట్టులో ఆడాలనే కసి ఇంకా ఉందని పేర్కొన్నాడు. 

Dinesh Karthik: భారత జట్టులో ఆడాలనే కసి ఇంకా ఉంది.. ఇప్పుడప్పుడే రిటైర్మెంట్‌ ప్రకటించేదిలే: డీకే

Dinesh Karthik says I Want to play for Team India again: టీమిండియా సీనియర్‌ బ్యాటర్, వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌ తన మనసులోని మాటను మరోసారి బయటపెట్టాడు. తనకు భారత జట్టులో ఆడాలనే కసి ఇంకా ఉందని పేర్కొన్నాడు. జట్టులో ఆడేందుకు తానింకా ప్రాక్టీస్‌ చేస్తున్నానని, ఇప్పుడప్పుడే రిటైర్మెంట్‌ ప్రకటించేదిలేదు అని డీకే స్పష్టం చేశాడు. దినేశ్‌ కార్తీక్‌ భారత్ తరఫున మ్యాచ్ ఆడి చాలా రోజులైంది. 2019 వన్డే ప్రపంచకప్‌లో డీకే చివరిసారిగా మ్యాచ్ ఆడాడు. అప్పటినుంచి బీసీసీఐ సెలెక్టర్లు అతడిని పట్టించుకోవడం లేదు. 

తాజాగా ఓ జాతీయ మీడియాతో దినేశ్‌ కార్తీక్‌ మాట్లాడుతూ... 'నేను దేశం కోసం మళ్లీ ఆడాలనే కసి ఇంకా ఉంది. అందుకోసం చేయాల్సిందల్లా చేస్తున్నా. నా అంతిమ లక్ష్యం భారత జట్టుకు ఆడడమే. జట్టులో ఆడేందుకు నేను  ప్రాక్టీస్‌ చేస్తున్నా. రాబోయే మూడేళ్లు ఇదే పనిలో ఉంటా. నేను ఆటను ఆడటం ఆనందిసస్తా. ఎప్పుడూ క్రికెట్‌ ఆడటం చాలా ఇష్టం' అని తెలిపాడు. 

'క్రికెట్‌ ఆడటం ఇష్టం కాబట్టే ఇప్పటికీ దేశవాళీ క్రికెట్‌లో కొనసాగుతున్నా. భారత జట్టులో ఆడలనే సయ్యద్‌ ముస్తాక్‌ అలీ, విజయ్‌ హజారే ట్రోఫీల్లో పాల్గొని జట్టును విజయవంతంగా నడిపిస్తున్నా.  రాష్ట్ర జట్టుగా మేము సాధించిన విజయాలు అపూర్వమైనవి. నా ప్రధాన లక్ష్యం దేశం కోసం మళ్లీ ఆడటమే. ముఖ్యంగా టీ20 ఫార్మాట్. టీ20ల్లో ఫినిషర్‌గా తిరిగి రావాలని చూస్తున్నా. నా గత రికార్డులు, ప్రదర్శనలు చాలా బాగున్నాయి' అని డీకే పేర్కొన్నాడు. 

'కామెంట్రీ పాత్రను కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నా. నేను రిటైరయ్యాక ఇలా క్రికెట్‌ వ్యాఖ్యాతగా కొనసాగాలనుకుంటున్నా. అయితే ఇంకో మూడేళ్ల వరకు ఆటకు వీడ్కోలు పలికే ప్రసక్తే లేదు' అని దినేశ్‌ కార్తీక్‌ స్పష్టం చేశాడు. డీకే భారత్ తరఫున 26 టెస్టులు, 94 వన్డేలు మరియు 32 టీ20లు ఆడాడు. ఇక ఐపీఎల్ టోర్నీలో మాత్రం క్రమం తప్పకుండా ఆడుతున్నాడు. 

Also Read: IND vs WI: బంపర్ ఆఫర్ పట్టేసిన షారుక్ ఖాన్, సాయి కిషోర్‌.. ఏకంగా టీమిండియాలో చోటు!!

Also Read: Cricketers Promote Pushpa: స్టార్ క్రికెటర్లు 'పుష్ప' పాటలకు స్టెప్పులు వేసింది అందుకేనా? బయటపడిన అమెజాన్ ప్లాన్!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More