ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ఇప్పటివరకూ ఒక్క టైటిల్ కూడా నెగ్గని జట్లలో ఢిల్లీ ఒకటి. గతంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌గా ఉన్న ఫ్రాంచైజీ పేరును గతేడాది ఢిల్లీ క్యాపిటల్స్‌గా మార్చారు. గతేడాది అత్యుత్తమ ప్రదర్శన చేసిన తమ జట్టు ఐపీఎల్ 2020 (IPL 2020) టైటిల్ విజేతగా నిలవనుందని ఢిల్లీ క్యాపిటల్స్ ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడ (Kagiso Rabada) ధీమా వ్యక్తం చేశాడు. గతేడాది క్వాలిఫయర్ 2లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) చేతిలో ఓటమిపాలై నిరాశగా ఇంటిదారి పట్టింది ఢిల్లీ క్యాపిటల్స్. Cristiano Ronaldo: పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో అరుదైన ఘనత
ఐపీఎల్ ప్రారంభమైన 2008 నుంచి నాలుగేళ్ల పాటు కాస్త పోరాటం చేసిన ఢిల్లీ జట్టు ఆపై కొన్నేళ్ల పాటు క్వాలిఫయర్ దరిదాపుల్లోకి రాలేదు. ప్రస్తుతం యువ ఆటగాళ్లతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నూతనోత్సాహాన్ని నింపుకుంది. గత సీజన్లో తమ జట్టు పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచిందని, ఈ ఏడాది కచ్చితంగా మెరుగైన ప్రదర్శనతో రాణించి ఐపీఎల్ 2020 విజేతగా ఢిల్లీ క్యాపిటల్స్ అవతరించనుందన్నాడు. AstraZeneca Vaccine: ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ట్రయల్స్ తాత్కాలికంగా నిలిపివేత
‘గతేడాది జోరును ఈ సీజన్లో కొనసాగిస్తాం. గత సీజన్లో దాదాపు టైటిల్ విజయానికి చేరువగా వెళ్లాం. మా ఆటగాళ్లకు ఆ ఉత్సాహంతో పాటు ధీమా పెరిగింది. సమష్టిగా విజయాలు సాధించి విజేతగా నిలవాలని భావిస్తున్నామంటూ’ ఐపీఎల్లో బెస్ట్ పేస్ బౌలర్లలో ఒకడైన కగిసో రబాడ తమ గేమ్ ప్లాన్‌నను వివరించాడు. తొలి ట్రైనింగ్ సెషన్ తర్వాత నమ్మకం కలిగిందన్నాడు. SRH IPL 2020 Schedule: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2020 షెడ్యూల్ పూర్తి వివరాలు
ఫొటో గ్యాలరీలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYeR