Home> క్రీడలు
Advertisement

నటితో హార్ధిక్ పాండ్యా డేటింగ్.. ప్రూఫ్ ఇదిగో..!

మీరు బిగ్ బాస్ షో సీజన్లన్నీ చూసినట్లయితే, ఖచ్చితంగా ఈ నటి ఎవరో గుర్తుకు వస్తుంది.

నటితో హార్ధిక్ పాండ్యా డేటింగ్.. ప్రూఫ్ ఇదిగో..!

మీరు బిగ్ బాస్ షో సీజన్లన్నీ చూసినట్లయితే, ఖచ్చితంగా ఈ నటి ఎవరో గుర్తుకు వస్తుంది. స్వీడిష్ మోడల్-నటి ఎల్లీ అవ్రామ్‌ బాలీవుడ్ సూపర్ స్టార్, బిగ్ బాస్ షో వ్యాఖ్యాత సల్మాన్ ఖాన్ వీరాభిమాని.  ఈ స్వీడిష్ మోడల్-నటి, భారత క్రికెటర్ హార్ధిక్ పాండ్యా డేటింగ్‌లో ఉన్నట్లు మరోసారి రుజువైంది. ఎల్లీ అవ్రామ్‌ డిసెంబర్ లో హార్ధిక్ అన్నయ్య కృనాల్ పాండ్యా వివాహానికి హాజరైనప్పటి నుంచి వీరి డేటింగ్ రిలేషన్ గురించి సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. కృనాల్ వివాహ వేడుకలో హార్ధిక్, ఎల్లీ అవ్రామ్‌తో కలిసి ఫొటోలు దిగగా అప్పట్లో అవి సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యాయి. తాజాగా ఎల్లీతో కలిసి హార్ధిక్ ఎయిర్‌పోర్టులో కనిపించాడు.

తాజాగా ఎల్లీతో కలిసి హార్ధిక్ ఎయిర్‌పోర్టులో కనిపించాడు. ఎల్లీనే స్వయంగా కారులో హార్ధిక్ పాండ్యాను ఎయిర్‌పోర్టులో డ్రాప్ చేసిన ఫోటోలను చూసి నెటిజన్లు ఎల్లీ, పాండ్యా డేటింగ్‌లో ఉన్నారంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆ సమయంలో ఎల్లీ కారులో కూర్చొని కెమరా కంట పడకుండా ముఖాన్ని కప్పి ఉంచే ప్రయత్నం చేయడం మీడియా కంట పడింది. హార్ధిక్ మాత్రం తనకేం సంబంధం లేదన్నట్లుగా లగేజీ బ్యాగ్‌తో ఎయిర్ పోర్టులోకి వెళ్లాడు.  ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భారత్, బంగ్లాదేశ్, శ్రీలంకల మధ్య మార్చి 6న ప్రారంభంకానున్న  ముక్కోణపు టోర్నీ నుంచి బీసీసీఐ పాండ్యాకు రెస్టు ఇచ్చిన సంగతి తెలిసిందే..!

fallbacks

fallbacks

fallbacks

fallbacks

fallbacks

fallbacks

fallbacks

 

Read More