Home> క్రీడలు
Advertisement

Sonu Soodకు ధన్యవాదాలు తెలిపిన Harbhajan Singh ,మొన్న సురేష్ రైనాకు, నిన్న హర్భజన్ సింగ్‌కు సోనూసూద్ సహాయం

వలస కూలీలు, దినసరి కార్మికులను లాక్‌డౌన్ సందర్భంగా వారి స్వస్థలాలకు వెళ్లేందుకు రైలు, బస్సు, విమాన టికెట్లు అందించి గొప్ప సాయాన్ని అందించాడు. తాజాగా కరోనా సెకండ్ వేవ్‌లో టీమిండియా క్రికెటర్లకు సైతం సోనూసూద్ సాయం చేసి కష్టకాలంలో ఆదుకుంటున్నాడు.

Sonu Soodకు ధన్యవాదాలు తెలిపిన Harbhajan Singh ,మొన్న సురేష్ రైనాకు, నిన్న హర్భజన్ సింగ్‌కు సోనూసూద్ సహాయం

కరోనా సమయంలో గత ఏడాది నటుడు సోనూసూద్ చేసిన అతడ్నిని రియ‌ల్ హీరోగా మార్చింది. వలస కూలీలు, దినసరి కార్మికులను లాక్‌డౌన్ సందర్భంగా వారి స్వస్థలాలకు వెళ్లేందుకు రైలు, బస్సు, విమాన టికెట్లు అందించి గొప్ప సాయాన్ని అందించాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కన్నా సోనూసూద్‌ను సాయం కోరడమే మంచిదని ప్రజలు సైతం భావిస్తున్నారని సోషల్ మీడియాలో అతడి పేరు మార్మోగింది.

సామాన్యులతో పాటు సెలబ్రిటీలకు సైతం సోనూసూద్ సాయాన్ని అందిస్తున్నాడు. ఇటీవల టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనాకు సాయం చేయగా, తాజాగా స్పిన్నర్ హర్భజన్ వంతు వచ్చింది. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న భారత క్రికెటర్లకు సైతం సాయం అందిస్తూ గొప్ప మనసును సోనూసూద్ చాటుకుంటున్నాడు. హర్భజన్ సింగ్‌కు రెమిడెసివర్ ఇంజక్షన్ సమయానికి ఏర్పాటు చేసి సాయం అందించాడు. కరోనా ఫస్ట్ వేవ్‌లో మొదలుపెట్టిన సాయాన్ని కరోనా సెకండ్ వేవ్‌లో సైతం నటుడు కొనసాగిస్తున్నాడు. టాలీవుడ్ అగ్రహీరోలు సైతం సోనూసూద్‌(Sonu Sood)ను చూసి నేర్చుకోవాలంటూ నెటిజన్లు పలుమార్లు విమర్శించడం తెలిసిందే.   

Also Read: Bhuvneshwar Kumar: పేసర్ భువనేశ్వర్ కుమార్‌కు షాకిచ్చిన BCCI సెలక్షన్ కమిటీ, WTC Finalకు భువీ దూరం

గత ఏడాది స్వస్థలాలకు వెళ్లడానికి, పూట గడవటం లేదని వారికి ఆహారం ఏర్పాటు చేసిన సోనూసూద్ సూపర్ హీరోగా మారిపోయాడు. కరోనా సెకండ్ వేవ్‌లో ఆక్సిజన్ సిలిండర్లు, రెమిడెసివర్ ఇంజెక్షన్లు, ఆస్పత్రిలో కరోనా బెడ్లు, ప్లాస్మా దానం లాంటి విషయాలలో తన సాయాన్ని కొనసాగిస్తున్నాడు. తనకు తెలిసిన వారికి రెమిడెసివర్ ఇంజెక్షన్లు కావాలని హర్బజన్ ట్వీట్ చేయగా.. సోనూసూద్‌ను అడగాలని ఫాలోయర్లు సూచించారు. దీనిపై స్పందించిన సోనూసూద్ కరోనా పేషెంట్లకు రెమిడెసివర్ ఇంజక్షన్ ఏర్పాటు చేశాడు.

Also Read: Team India ప్లేయర్స్ కేవలం Covishield Vaccine తీసుకుంటున్నారు, కారణమేంటో తెలుసా

అడిగిన వెంటనే స్పందించి కష్టకాలంలో సోనూసూద్ చేసిన సాయంపై టీమిండియా క్రికెటర్ హర్భజన్ సింగ్(Harbhajan Singh) స్పందించాడు. థ్యాంక్యూ బ్రదర్.. దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి, మీకు మరింత బలాన్ని అందించాలని ఆకాంక్షిస్తూ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ ట్వీట్ చేశాడు. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల ప్రజలు సాయం కోరుతూ సోనూసూద్‌కు నిరంతరం ట్వీట్లు చేస్తున్నారు. గత ఏడాది తన ఆస్తులు తనఖాపెట్టి సైతం సాయం చేశాడంటూ నటుడిపై ప్రశంసలు వెల్లువెత్తడం తెలిసిందే. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More