Home> క్రీడలు
Advertisement

హర్భజన్‌కు చేదు అనుభవం.. సాయం కోరినా ప్చ్!

భారత సీనియర్ క్రికెటర్ హర్బజన్ సింగ్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఐపీఎల్ లో తమ జట్టు సీఎస్కేతో కలిసి ప్రాక్టీస్ చేసేందుకు కొయంబత్తూర్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

హర్భజన్‌కు చేదు అనుభవం.. సాయం కోరినా ప్చ్!

చెన్నై: భారత క్రికెటర్ హర్భజన్‌కు చేదు అనుభవం ఎదురైంది. తనకు సాయం చేయాలని అధికారులను సైతం ఆశ్రయించాల్సి వచ్చింది. రెండు రోజులు గడిచినా భజ్జీకి సాయం అందక పోవడం గమనార్హం. అసలు ఏం జరిగిందంటారా.. మార్చి 6న హర్భజన్ సింగ్ ముంబై నుండి కొయంబత్తూర్ వెళ్లాడు. ఇండిగో 6E 6313 విమానంలో ప్రయాణించగా.. కిట్ బ్యాగ్ నుంచి బ్యాట్ మిస్సయిందని, ఇతరుల వస్తువులు తీసుకోవడాన్ని చోరీ చేయడం అంటారని ట్వీట్ చేశాడు భజ్జీ.

Also Read: మారుతీరావు అంత్యక్రియలు: అమృతకు భారీ షాక్

తన బ్యాట్ తనకు అందేలా చర్యలు తీసుకోవాలన్నాడు. చోరీ చేసిన వ్యక్తిని పట్టుకోవాలని, సాయం చేయాలని ఆ ట్వీట్ ద్వారా ఇండిగో యాజమాన్యానికి విజ్ఞప్తి చేశాడు. జరిగిన పరిణామంపై ఇండిగో ట్విట్టర్ ద్వారా స్పందించింది. బ్యాట్ చోరీకి గురవడంపై భజ్జీకి క్షమాపణ చెప్పారు. బ్యాట్ ఎవరు చోరీ చేశారో గుర్తించి చర్యలు తీసుకోనున్నట్లు స్నిగ్ధ ఆ ట్వట్‌లో పేర్కొన్నారు. మార్చి 8న హర్భజన్ ఇండిగో ట్వీట్‌పై స్పందించారు. దయచేసి సాయం చేయండి అని కోరాడు. మీరు సీరియస్‌గా తీసుకోవడం లేదంటూ మరుసటి భజ్జీ మరో ట్వీట్ సైతం చేశాడు.

తప్పక చదవండి: జబర్దస్త్ ట్విస్ట్: దొరబాబు, పరదేశీ అలా బుక్కయ్యారా!

త్వరలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 13) ప్రారంభం కానున్న నేపథ్యంలో భజ్జీ ముంబై నుంచి కొయంబత్తూర్‌కు వెళ్లాడు. ఈ క్రమంలో భజ్జీ బ్యాట్ చోరీకి గురైంది. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఫ్రాంచైజీకి ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. కాగా, కెప్టెన్ ఎంఎస్ ధోనీ సహా మరికొందరు ఆటగాళ్లు కొన్ని రోజుల కిందట చెన్నైలో ప్రాక్టీస్ మొదలుపెట్టారు. తాజాగా భజ్జీ జట్టుతో కలిసి ప్రాక్టీస్ చేయనున్నాడు.

See Pics: సెగలు రేపుతున్న రామ్ చరణ్ భామ

fallbacks

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Read More