Home> క్రీడలు
Advertisement

Team India: మ్యాన్‌ ఆఫ్ ద మ్యాచ్‌ అవార్డు గెలిచినా టీమ్‌ నుంచి ఔట్.. ఈ ప్లేయర్లను వెంటాడిన దురదృష్టం

Kuldeep Yadav Drop: టీమిండియా జెర్సీ ధరించి జట్టును గెలిపించాలని ఎంతో మంది ఆటగాళ్ల కోరిక. అద్భుత ప్రదన్శన తరువాత జట్టులో స్థానం సుస్థిరం అవుతుందని ధీమాతో ఉంటారు. కానీ కొందరు ప్లేయర్లను దురదృష్టం వెంటాడింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలిచిన తరువాత కూడా తుది జట్టులో స్థానం కోల్పోయారు. ఆ ప్లేయర్లు ఎవరంటే..?
 

Team India: మ్యాన్‌ ఆఫ్ ద మ్యాచ్‌ అవార్డు గెలిచినా టీమ్‌ నుంచి ఔట్.. ఈ ప్లేయర్లను వెంటాడిన దురదృష్టం

Kuldeep Yadav Drop: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ తరఫున కుల్దీప్ యాదవ్ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్, రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు పడగొట్టి మంచి ప్రదర్శన చేశాడు. కానీ రెండో టెస్టుకు తుది జట్టులో స్థానం కోల్పోయాడు. దీనిపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. కానీ కుల్దీప్ యాదవ్ వంటి దురదృష్టకర ఆటగాళ్లు కూడా టీమిండియాలో గతంలోనూ ఉన్నారు. ఓ ఆటగాడు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు పొందిన తర్వాత.. తరువాతి మ్యాచ్‌లో చోటు దక్కుతుందని కచ్చితంగా నమ్మకంతో ఉంటాడు. కానీ మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ పొందిన తర్వాత ఆ ఫార్మాట్‌లో ఇప్పటివరకు భారత్‌ తరఫున మళ్లీ ఆడే అవకాశం లభించని ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు. వారిలో కొందరు ఇప్పటికే రిటైర్మెంట్ అయ్యారు.

భువనేశ్వర్ కుమార్

స్వింగ్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ తన చివరి టెస్టును 2018లో దక్షిణాఫ్రికాతో ఆడాడు. ఈ మ్యాచ్‌లో భువీ 63 పరుగులతో పాటు 4 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించగా.. భువనేశ్వర్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. ఆ తర్వాత అతనికి ఇప్పటివరకు టెస్టు ఆడే అవకాశం రాలేదు. టెస్టులో ఈ స్వింగ్ బౌలర్ పేరును సెలెక్టర్లు పరిగణలోకి తీసుకోవడం లేదు. 

అమిత్ మిశ్రా

అమిత్ మిశ్రా చివరిసారిగా 2016లో న్యూజిలాండ్‌తో భారత్ తరఫున వన్డే ఆడాడు. విశాఖపట్నంలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 18 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. ఆ మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. అలాగే సిరీస్‌లోని 5 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డును అందుకున్నాడు. ఆ తర్వాత ఇప్పటివరకు భారత్ తరఫున ఏ వన్డే ఆడలేదు ఈ లెగ్ స్పిన్నర్.

ప్రజ్ఞాన్ ఓజా

సచిన్ టెండూల్కర్ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ను 2013లో వెస్టిండీస్‌తో ఆడాడు. మరో భారత ఆటగాడు ప్రజ్ఞాన్ ఓజాకు ఇది చివరి మ్యాచ్. లెఫ్టార్మ్ స్పిన్నర్ ఓజా ఈ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఐదు వికెట్లు చొప్పున పడగొట్టాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌ అవార్డకు ఎంపికయ్యాడు. అయితే ఆ తర్వాత అతనికి మళ్లీ మ్యాచ్‌లో ఆడే అవకాశం రాలేదు. అతను 2020లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు.

ఇర్ఫాన్ పఠాన్

2012లో భారత జట్టు శ్రీలంక పర్యటనలో చివరి మ్యాచ్‌లో ఇర్ఫాన్ పఠాన్ 29 పరుగులతో పాటు 5 వికెట్లు పడగొట్టాడు. భారత్‌ 20 పరుగుల తేడాతో విజయం సాధించగా.. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా పఠాన్ ఎంపికయ్యాడు. అయితే ఆ తర్వాత ఈ ఆల్‌రౌండర్‌కు భారత్‌ తరఫున వన్డేలు ఆడే అవకాశం రాలేదు. ఆ సిరీస్‌లో 5 మ్యాచ్‌ల్లో 13 పరుగులు చేసిన రోహిత్ శర్.. ప్రస్తుతం మూడు ఫార్మాట్‌లలో టీమిండియా కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు.

బద్రీనాథ్

చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఐపీఎల్‌లో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన సుబ్రమణ్యం బద్రీనాథ్ 2011లో భారత్ తరఫున టీ20 అరంగేట్రం చేసే అవకాశం దక్కించుకున్నాడు. ఆ మ్యాచ్‌లో అతను 43 పరుగుల  చేసి భారత్‌ను గెలిపించాడు. ఈ ప్రదర్శన తర్వాత.. అతను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. అయితే తరువాత బద్రీనాథ్‌కు భారత్‌ తరఫున మరో టీ20 ఆడే అవకాశం రాలేదు.

Also Read: MLAs Salary Statewise: రాష్ట్రాల వారీగా ఎమ్మెల్యే జీతాల వివరాలు.. తెలంగాణ, ఏపీకి తేడా ఎంతంటే..?

Also Read: LPG Gas Cylinder Price: న్యూఇయర్‌లో గుడ్‌న్యూస్.. గ్యాస్ సిలిండర్ ధర తగ్గే అవకాశం..!  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More