Home> క్రీడలు
Advertisement

Chris Gayle bat broken viral video: క్రిస్ గేల్ బ్యాట్ రెండు ముక్కలు చేసిన బౌలర్ Odean Smith

Chris Gayle bat broken in CPL 2021 match : క్రిస్ గేల్ చేతిలో క్రికెట్ బ్యాట్ విరిగిపోయిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సీపీఎల్ 2021 టోర్నీలో భాగంగా గయానా అమెజాన్ వారియర్స్ vs సెయింట్ కిట్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో క్రిస్ గేల్‌కి ఈ వింత అనుభవం ఎదురైంది.

Chris Gayle bat broken viral video: క్రిస్ గేల్ బ్యాట్ రెండు ముక్కలు చేసిన బౌలర్ Odean Smith

Chris Gayle bat broken in CPL 2021 match: క్రిస్ గేల్‌‌కి క్రికెట్ ప్రపంచంలో ఎలాంటి పేరుందో క్రికెట్ ప్రియులు అందరికీ తెలిసిందే. విండీస్ విధ్వంసకర ఆటగాడిగా పేరున్న యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ భారీ షాట్లు కొట్టడంలో ఎక్స్‌పర్ట్. అలాంటి స్టార్ బ్యాట్స్‌మన్ కొట్టిన ఓ భారీ షాట్‌కి ఏకంగా బ్యాట్ విరిగిపోయింది. క్రిస్ గేల్ చేతిలో క్రికెట్ బ్యాట్ విరిగిపోయిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సీపీఎల్ 2021 టోర్నీలో భాగంగా గయానా అమెజాన్ వారియర్స్ vs సెయింట్ కిట్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో క్రిస్ గేల్‌కి ఈ వింత అనుభవం ఎదురైంది. 

ఒడియన్ స్మిత్ (Odean Smith bowling) వేసిన బంతిని క్రిస్ గేల్ భారీ షాట్ కొట్టేందుకు ట్రై చేశాడు. బ్యాట్‌ను బంతి బలంగా తాకడంతోనే ఆ బ్యాట్ రెండు ముక్కలైంది. కింది భాగం ఎగిరిపోయి పిచ్ పక్కన ఓవైపు పడగా హ్యాండిల్ మాత్రమే క్రిస్ గేల్ చేతిలో మిగిలింది. దీంతో చేతిలో ఉన్న బ్యాట్‌ హ్యాండిల్‌ని ఆశ్చర్యంగా చూడటం క్రిస్ గేల్ (Chris Gayle's bat broken) వంతయ్యింది. 

Also read : T20 rankings: టీ20 ర్యాంకింగ్స్ ప్రకటించిన ICC.. 4వ స్థానంలో Virat Kohli

విద్వంసకర ఆటగాడి బ్యాట్ విరిచిన బౌలర్‌గా ఒడియన్ స్మిత్ పేరు సోషల్ మీడియాకెక్కింది. మరి ఇంకెందుకు ఆలస్యం.. ? ఆ వైరల్ వీడియో (Viral videos) మీరు కూడా చూసి ఎంజాయ్ చేశారు కదా!!

Also read : IPL 2021: క్రికెట్ ప్రేమికులకు గుడ్ న్యూస్..ఐపీఎల్ మ్యాచ్‌లకు ప్రేక్షకులకు అనుమతి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More