Home> క్రీడలు
Advertisement

Jay Shah: బిగ్‌ బ్రేకింగ్‌.. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి చైర్మన్ జై షా ఏకగ్రీవ ఎన్నిక

Jay Shah Selected As ICC Chairman: ప్రపంచ క్రికెట్‌కు సారథ్యం వహించే అవకాశం మరోసారి భారత్‌కు దక్కింది. ఐసీసీ చైర్మన్‌గా జై షా ఏకగ్రీవంగా నియమితులయ్యారు.

Jay Shah: బిగ్‌ బ్రేకింగ్‌.. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి చైర్మన్ జై షా ఏకగ్రీవ ఎన్నిక

ICC Chairman Jay Shah: అంతర్జాతీయ క్రికెట్‌ మండలికి చైర్మన్‌గా జై షా నియమితులయ్యారు. ఎప్పటి నుంచో చైర్మన్‌ పదవి అతడిదే అని ప్రచారం జరుగుతుండగా అదే నిజమైంది. ప్రపంచ క్రికెట్‌ మండలికి ఏకగ్రీవంగా జై షా అధ్యక్షుడిగా నియమితులు కావడం విశేషం. ఐసీసీ చైర్మన్‌గా నియమితులవడంతో అతడు బీసీసీఐకి వీడ్కోలు పలికారు. డిసెంబర్‌ 1వ తేదీన ఐసీసీ చైర్మన్‌గా జై షా బాధ్యతలు చేపట్టనున్నాడు. 

Also Read: Shikhar Dhawan: క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి భారీ షాకిచ్చిన గబ్బర్.. రిటైర్మెంట్‌ ప్రకటించిన శిఖర్‌ ధావన్‌ వీడియో వైరల్‌..

ప్రస్తుత ఐసీసీ చైర్మన్‌ గ్రెగ్ బార్క్లే మూడో సారి పదవిలో కొనసాగేందుకు ఇష్టపడలేదు. దీంతో చైర్మన్‌గా అతడి పదవీకాలం నవంబర్‌తో ముగియనుంది. అతడి పదవీకాలం ముగిసిన తర్వాత డిసెంబర్‌ 1వ తేదీన చైర్మన్‌ పీఠాన్ని జై షా అధిష్టించనున్నాడు. చైర్మన్ పదవికి జై షా ఒక్కరే పోటీ పడడంతో ఏకగ్రీవం చేశారు. క్రికెట్‌ను ప్రపంచవ్యాప్తం చేయడానికి.. ప్రజాదరణను విస్తరించడంలో జై షా విజయవంతం అవుతారని ఐసీసీ విశ్వాసం వ్యక్తం చేసింది. లాస్‌ ఏంజిల్స్‌ 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను జై షా చేరుస్తారని భావించింది.

Also Read: KL Rahul Retirement: కేఎల్ రాహుల్ రిటైర్మెంట్ ప్రకటించనున్నాడా..ఆ పోస్టు అర్థమేంటీ?

 

ఐసీస్‌ చైర్మన్‌గా ఎన్నికవడం పట్ల జై షా స్పందించారు. 'అంతర్జాతీయ క్రికెట్‌ మండలి బాధ్యతలు చేపట్టడం గౌరవంగా భావిస్తున్నా. క్రికెట్‌ను విశ్వవ్యాప్తం చేయడంలో తాను అన్ని సభ్య దేశాలతో కలిసి పని చేస్తా' అని తెలిపారు. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి క్రికెట్‌ను మరింత అభివృద్ధి పరుస్తానని చెప్పారు.

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More