Home> క్రీడలు
Advertisement

ఆస్ట్రేలియా ఫుడ్ మెనూలో బీఫ్ ఉండటంపై బీసీసీఐ అభ్యంతరం

ఆస్ట్రేలియా ఫుడ్ మెనూలో బీఫ్.. అభ్యంతరం చెప్పిన బీసీసీఐ

ఆస్ట్రేలియా ఫుడ్ మెనూలో బీఫ్ ఉండటంపై బీసీసీఐ అభ్యంతరం

నవంబర్‌లో ఆస్ట్రేలియాతో ఆ దేశం గడ్డపై జరగనున్న పర్యటనకు అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఆస్ట్రేలియా వెళ్లిన బీసీసీఐ అధికారుల బృందం అక్కడ టీమిండియా ఆటగాళ్లకు ఏర్పాటు చేయనున్న ఫుడ్ మెనూపై అభ్యంతరాలు వ్యక్తంచేసింది. టీమిండియాకు సరఫరా చేసే ఫుడ్ మెనూలోంచి బీఫ్ వంటకాలను తొలగించాల్సిందిగా బీసీసీఐ క్రికెట్ ఆస్ట్రేలియాకు సూచించింది. అంతేకాకుండా బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా(బీసీసీఐ) - క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) మధ్య జరిగే అవగాహన ఒప్పందంలోనూ ఈ అంశాన్ని చేర్చాల్సిందిగా బీసీసీఐ టీమ్ క్రికెట్ ఆస్ట్రేలియాకు తేల్చిచెప్పింది. 

Read More