Home> క్రీడలు
Advertisement

IND vs ENG: టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్తి, కెప్టెన్ కోహ్లీపై బీసీసీఐ ఆగ్రహం.. ఎందుకంటే..

టీమిండియా కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ విరాట్ కోహ్లీపై బీసీసీఐ తీవ్ర అగ్రహం వ్యక్తం చేసింది. అనుమతి లేకుండా ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైనందుకు వీరిపై తీవ్ర కోపంగా ఉంది.

IND vs ENG: టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్తి, కెప్టెన్ కోహ్లీపై బీసీసీఐ ఆగ్రహం.. ఎందుకంటే..

Virat kohli-Ravi Shastri: ఓవల్ విజయంతో టీమిండియా సంతోషంగా ఉంది. అయితే, బీసీసీఐ మాత్రం చాలా కోపంగా ఉంది.  కెప్టెన్ విరాట్ కోహ్లీ, ప్రధాన కోచ్ రవిశాస్త్రి వైఖరిపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్(BCCI) మాత్రం తీవ్ర అసహనం వ్యక్తం చేసిందిత. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, భారత క్రికెట్ బోర్డులోని మూలాలను పరిశీలిస్తే.. గతవారం లండన్‌లో జరిగిన ఒక బహిరంగ కార్యక్రమానికి విరాట్ కోహ్లీ(Virat Kohli)తో కలిసి రవిశాస్త్రి కూడా హాజరు అయ్యారంట. దీంతో ఈ విషయంపై బీసీసీఐ వీరిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

మంగళవారం, టీమిండియా కోచ్ శాస్త్రి(Ravi Shastri), కెప్టెన్ కోహ్లీతోపాటు ఇతర సభ్యులు ఓ పుస్తకావిష్కరణకు హాజరయ్యేందుకు వెళ్లారని, అక్కడ హాల్ మొత్తం జనంతో నిండిపోయిందని సమాచారం. ఈ కార్యక్రమానికి హాజరైన 5 రోజుల తర్వాత ఆదివారం రవిశాస్త్రికి కరోనా పరీక్ష పాజిటివ్‌(Covid Positive)గా తేలింది. ఆయన సన్నిహితంగా ఉన్నందున బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్, ఫిజియో నితిన్ పటేల్ పాజిటివ్‌గా తేలారు. ప్రస్తుతం ఈ నలుగురిని ఐసోలేషన్‌(Isolation)లో ఉంచినట్లు తెలుస్తోంది.

Also Read: IND vs ENG: చెలరేగిన భారత బౌలర్లు...నాలుగో టెస్ట్‌లో టీమిండియా ఘన విజయం

అనుమతినివ్వలేదు..
ఆ కార్యక్రమానికి హాజరయ్యేందుకు రవిశాస్త్రితోపాటు విరాట్ కోహ్లీకి బోర్డు అనుమతించలేదని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఓ అధికారి మాట్లాడుతూ.. “బోర్డ్ ఆ ఈవెంట్‌(Event)కు సంబంధించిన ఫోటోలను అందుకుంది. ఈ విషయంలో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ సంఘటనతో బోర్డు సిగ్గుపడేలా చేశారు. ఈ విషయంపై బోర్డు రవిశాస్త్రితోపాటు విరాట్ కోహ్లీ(Virat Kohli)ని ప్రశ్నిస్తుంది. ఈ మొత్తం ఎపిసోడ్‌లో జట్టు అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ గిరీష్ డోంగ్రే పాత్ర కూడా ప్రశ్నార్థకంగా మారింది.

ఈసీబీ కూడా అనుమతివ్వలేదు..
బ్రిటిష్ మీడియా నివేదిక ప్రకారం, “ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్(England and Wales Cricket Board) కూడా ఆ కార్యక్రమానికి హాజరు కావడానికి భారత జట్టు సభ్యులను అనుమతించలేదు.” ఈ మొత్తం సమస్యపై బీసీసీఐ ప్రస్తుతం ఈసీబీ(ECB)ని సంప్రదిస్తోంది. సాఫీగా సిరీస్‌ను ముగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మేమంతా రవిశాస్త్రి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామని బీసీసీఐ అధికారి తెలిపారు. బుధవారం టీ 20 ప్రపంచకప్(T20 World Cup) కోసం జట్టును ఎంపిక చేసే సమావేశంలో ఈ సమస్యను లేవనెత్తవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More