Home> క్రీడలు
Advertisement

భారతీయ జెండాకి పాకిస్తాన్ క్రికెటర్ గౌరవం..!

మూడు రంగుల జెండాపై ఓ పాకిస్తాన్ క్రికెటర్ తనదైన శైలిలో గౌరవాభిమానాలను అందించారు.

భారతీయ జెండాకి పాకిస్తాన్ క్రికెటర్ గౌరవం..!

మూడు రంగుల జెండాపై ఓ పాకిస్తాన్ క్రికెటర్ తనదైన శైలిలో గౌరవాభిమానాలను అందించారు. స్విట్జర్లాండ్‌లో మ్యాచ్ చూడడానికొచ్చిన అనేకమంది ప్రేక్షకులలో.. ఓ ప్రేక్షకురాలు చేతిలో భారతీయ జెండా పట్టుకొని నిలుచొని ఉండగా.. అప్పుడే అటువైపు వెళ్తున్న పాక్ క్రికెటర్ షాహిద్‌ని చూసి ఫోటో అడుగుతుంది.

అయితే ముందు జెండాని సరిగ్గా కనిపించేలా పట్టుకోమని చెప్పి.. ఆ తర్వాత ఆమెతో ఆ క్రికెటర్ ఫోటోకి ఫోజివ్వడం గమనార్హం. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తోంది. ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలను ఆఫ్రిది సైతం తన ట్విటర్, ఫేస్బుక్‌‌లలో పోస్టు చేయడం విశేషం. 

Read More