Home> క్రీడలు
Advertisement

టీమిండియా కెప్టెన్‌గా అజింక్య రహానే; ఇంగ్లాండ్ వన్డే సిరీస్‌లో రాయుడుకి చోటు

ముంబై వాంఖడే స్టేడియం వేదికగా జూన్ 14 నుంచి అఫ్గనిస్తాన్ జట్టుతో జరిగే టెస్ట్ మ్యాచ్‌ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది.

టీమిండియా కెప్టెన్‌గా అజింక్య రహానే; ఇంగ్లాండ్ వన్డే సిరీస్‌లో రాయుడుకి చోటు

ముంబై వాంఖడే స్టేడియం వేదికగా జూన్ 14 నుంచి అఫ్గనిస్తాన్ జట్టుతో జరిగే టెస్ట్ మ్యాచ్‌ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. ఆప్ఘనిస్థాన్ లో జరిగే ఈ టెస్ట్ మ్యాచ్ కు కెప్టెన్ విరాట్ కోహ్లీ అందుబాటులో ఉండడు. దీంతో కోహ్లీ స్థానంలో ప్రస్తుత టెస్ట్ వైస్ కెప్టెన్ అజింక్య రహానేకు సారథ్య బాధ్యతలు అప్పగించారు. ఆప్థనిస్థాన్ కు ఇదే తొలి అధికారిక టెస్ట్ కావడం గమనార్హం. జట్టులో అజింక్యా రహానే (కెప్టెన్), శిఖర్ ధావన్, మురళీ విజయ్, కేఎల్ రాహుల్, చటేశ్వర్ పుజారా, కరుణ్ నాయర్, వృద్ధిమాన్ సాహా, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, ఉమేష్ యాదవ్, షమీ, హార్ధిక్ పాండ్యా, ఇషాంత్ శర్మ, శార్థూల్ ఠాకూర్ లకు స్థానం కల్పించారు. గత సంవత్సరం ధర్మశాలలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌కి కోహ్లీ భుజం గాయం కారణంగా దూరం కావడంతో అతని స్థానంలో రహానే కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఉత్కంఠభరితంగా సాగిన ఆ టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఆప్ఘన్ తో పాటు బీసీసీఐ ఇర్లాండ్ తో జరిగే టీ20లకు, ఇంగ్లాండ్ తో జరిగే టీ20లకు, వన్డేలకు జట్ల వివరాలను ప్రకటించింది.

ఐర్లాండ్‌తో 2 టీ20లకు భారత జట్టు: విరాట్‌ కోహ్లీ (సారథి), శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, సురేశ్‌ రైనా, మనీశ్‌ పాండే, ఎంఎస్‌ ధోనీ, దినేశ్‌ కార్తీక్‌, యజువేంద్ర చాహల్‌, వాషింగ్టన్‌ సుదర్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, భువనేశ్వర్‌ కుమార్‌, జస్ప్రీత్‌ బుమ్రా, హార్దిక్‌ పాండ్య, సిద్ధార్థ్‌ ఔల్‌, ఉమేశ్‌ యాదవ్‌

 

ఇంగ్లాండ్‌తో 3 టీ20లకు భారత జట్టు: విరాట్‌ కోహ్లీ (సారథి), శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, సురేశ్‌ రైనా, మనీశ్‌ పాండే, ఎంఎస్‌ ధోనీ, దినేశ్‌ కార్తీక్‌, యజువేంద్ర చాహల్‌, వాషింగ్టన్‌ సుదర్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, భువనేశ్వర్‌ కుమార్‌, జస్ప్రీత్‌ బుమ్రా, హార్దిక్‌ పాండ్య, సిద్ధార్థ్‌ ఔల్‌, ఉమేశ్‌ యాదవ్‌

 

ఇంగ్లాండ్‌తో 3 వన్డేలకు భారత జట్టు: విరాట్‌ కోహ్లీ (సారథి), శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, అంబటి రాయుడు, ఎంఎస్ ధోనీ, దినేశ్‌ కార్తీక్‌, యజువేంద్ర చాహల్‌, వాషింగ్టన్‌ సుదర్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, భువనేశ్వర్‌ కుమార్‌, జస్ప్రీత్‌ బుమ్రా, హార్దిక్‌ పాండ్య, సిద్ధార్థ్‌ ఔల్‌, ఉమేశ్‌ యాదవ్‌

యూకేలో జరుగనున్న పరిమిత ఓవర్ల క్రికెట్ టోర్నమెంట్, ఇంగ్లాండ్ టూర్‌లో పాల్గొననున్న భారత్-ఏ జట్టును జాతీయ సెలెక్షన్ కమిటీ ప్రకటించింది. యువ క్రికెటర్‌లు పృథ్వీ షా, శుభ్‌మాన్ గిల్, ఇండియా-ఏ జట్టులో ఆడనున్నారు. టీమిండియా-ఏ జట్టుకు రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు.

 

 

 

Read More