Home> క్రీడలు
Advertisement

Abrar Ahmed: అరంగేట్రంలోనే అదరగొట్టిన పాకిస్తాన్ బౌలర్.. ఒకే ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు! గూగ్లీకి స్టోక్స్‌ మతిపోయింది

Abrar Ahmed tooks 7 Wickets in Pakistan vs England 2nd Test. పాకిస్తాన్‌ యువ సంచలనం అబ్రార్‌ అహ్మద్‌ అరంగేట్ర టెస్టులోనే సంచలన ప్రదర్శన చేశాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు పడగొట్టాడు. 
 

Abrar Ahmed: అరంగేట్రంలోనే అదరగొట్టిన పాకిస్తాన్ బౌలర్.. ఒకే ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు! గూగ్లీకి స్టోక్స్‌ మతిపోయింది

Pakistan spinner Abrar Ahmed tooks 7 Wickets in his maiden international game: పాకిస్తాన్‌ యువ సంచలనం అబ్రార్‌ అహ్మద్‌ అరంగేట్ర టెస్టులోనే సంచలన ప్రదర్శన చేశాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టాడు. ఇక్కడ విశేషం ఏంటంటే.. తొలి ఇన్నింగ్స్‌లో మొదటి ఐదు వికెట్లు అబ్రార్‌ పడగొట్టినవే. తొలి ఇన్నింగ్స్‌లో పాక్ యువ స్పిన్నర్‌ 22 ఓవర్లలో 114 పరుగులిచ్చి ఏడు వికెట్లు తీశాడు. దాంతో అరంగేట్ర టెస్టులో ఒక ఇన్నింగ్స్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన మూడో బౌలర్‌గా అబ్రార్‌ నిలిచాడు.

ముల్తాన్‌ వేదికగా పాకిస్తాన్‌, ఇంగ్లండ్‌ జట్ల మధ్య శుక్రవారం రెండో టెస్టు ఆరంభం అయింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ను అబ్రార్‌ అహ్మద్‌ ఆదిలోనే దెబ్బకొట్టాడు. ఓపెనర్‌ జాక్‌ క్రాలే (19) తక్కువ పరుగులకే పెవిలియన్‌కు పంపాడు. ఈ సమయంలో బెన్‌ డకెట్‌ (63), ఓలీ పోప్‌ (60) క్రీజులో నిలబడ్డారు. హాఫ్ సెంచరీలు చేసిన వీరి భాగస్వామ్యంను విడదీయడం అబ్రార్‌కు మాత్రమే సాధ్యమైంది. డకెట్‌ను ఔట్ చేసిన అబ్రార్‌.. పోప్‌ను కూడా పెవిలియన్‌కు పంపాడు. అనంతరం జో రూట్‌ (8), హ్యారీ బ్రూక్‌ (9), బెన్‌ స్టోక్స్‌ (30), విల్‌ జాక్స్‌ (31)ల వికెట్లు కూడా తీశాడు. 

అబ్రార్‌ అహ్మద్‌ తీసిన అన్ని వికెట్లలో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌ను అవుట్‌ చేసిన బాల్ హైలెట్ అని చెప్పాలి. అబ్రార్‌ అద్భుతమైన గూగ్లీ సాధించగా.. డిఫెన్స్‌ ఆడే క్రమంలో స్టోక్స్‌ ముందుకు వచ్చాడు. బంతి బ్యాటుకు కనెక్ట్ కకాకపోవడంతో మిడిల్‌ స్టంప్‌ ఎగిరిపోయింది. దీంతో స్టోక్స్‌ మతిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అరంగేట్రంలోనే అదరగొట్టిన పాకిస్తాన్ బౌలర్ అబ్రార్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. 

అబ్రార్‌ అహ్మద్‌ స్పిన్‌ ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 51.4 ఓవర్లలో 281 పరుగులకు ఆలౌటైంది. బెన్‌ డకెట్ (63), ఓలీ పోప్‌ (60) టాప్ స్కోరర్లు. అబ్రార్‌ (144/7) సంచలన బౌలింగ్‌తో 7 వికెట్స్ పడగొట్టగా.. జాహిద్‌ మహ్మద్‌ 3 వికెట్లు తీశాడు. మూడు టెస్టుల మ్యాచ్‌ల సిరీస్లో భాగంగా రావల్పిండిలో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లీష్ జట్టు 74 పరుగుల తేడాతో విజయం సాధించి 1-0 తేడాతో ఆధిక్యంలో ఉంది. దాంతో రెండో టెస్టులో గెలుపొంది సిరీస్‌ను సమం చేయాలని పాక్‌ చూస్తోంది.

Also Read: Ananya Panday Pics: పొట్టి డ్రెస్‌లో అనన్యా పాండే.. మినీ స్కర్ట్ ఉన్నా లేకున్నా ఒకటే!  

Also Read: Best Mileage Scooters: పెట్రోల్ తక్కువ తాగి.. ఎక్కువ మైలేజ్ ఇచ్చే స్కూటర్లు ఇవే! ఒకసారి ట్యాంక్‌ నింపితే పరుగేపరుగు  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Read More