Home> ఆధ్యాత్మికం
Advertisement

Amalaki Ekadashi Date: అమలకి ఏకాదశి రోజు ఇలా చేస్తే.. మీ ఇంట్లో కాసులు వర్షమే..

When is Amalaki Ekadashi: ఈ నెలలో అత్యంత అరుదైన ఏకాదశి రాబోతుంది. అదే అమలకి ఏకాదశి. ఇది విష్ణువుకు ఎంతో ప్రీతిపాత్రమైన ఏకాదశి. ఈరోజున ఉపవాసం చేస్తూ హరినామస్మరణ చేస్తే మీరు ఏది అనుకుంటే అది జరుగుతుంది. 
 

Amalaki Ekadashi Date:  అమలకి ఏకాదశి రోజు ఇలా చేస్తే.. మీ ఇంట్లో కాసులు వర్షమే..

Amalaki Ekadashi Date and Significance: హిందూమతంలో ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రతి నెలా శుక్లపక్ష, కృష్ణపక్ష అనే రెండు ఏకాదశులు వస్తాయి. ఇవి లక్ష్మీదేవి, శ్రీహరికి అంకితం చేయబడ్డాయి. ఈరోజున వీరిని పూజించి ఏది కోరుకుంటే అది జరుగుతుందని భక్తుల నమ్మకం. ఫాల్గుణ మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని అమలకీ ఏకాదశి లేదా ఉసిరి ఏకాదశి అంటారు. ఈరోజున విష్ణువుతోపాటు ఉసిరి చెట్టును పూజిస్తారు. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి సుఖసంతోషాలు అష్టఐశ్వర్యాలు సిద్దిస్తాయి. ఈ సంవత్సరం ఈ అమలకీ ఏకాదశి ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాం. 

పూజ, పారణ సమయాలు తెలుసుకోండి..
ఈ ఏడాది అమలకీ ఏకాదశి మార్చి 20 అర్ధరాత్రి 12:21 గంటలకు ప్రారంభమై.. అంటే మార్చి 21 తెల్లవారుజామున 2:22 గంటలకు వరకు ఉంటుంది. ఉదయతిథి ఆధారంగా, మార్చి 20న అమలకి ఏకాదశి జరుపుకుంటారు. పారణ సమయం మార్చి 21 మధ్యాహ్నం 1:07 నుండి 3:32 వరకు ఉంటుంది.

అమలకి ఏకాదశి రోజున ఈ పని చేయండి
అమలకీ ఏకాదశి రోజున బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసి మంచి బట్టలు ధరించాలి. ఆ తర్వాత రోజంతా ఉపవాసం ఉంటూ శ్రీమహావిష్ణువును పూజించాలి. ఈరోజున మీ ఇంట్లోని పూజ గదిలో విష్ణువు ఫోటోను పెట్టి.. దానికి ముందుగా పసుపు, కుంకమ పెట్టాలి. ఆ తర్వాత పూజలో ఉసిరి కాయను ఉంచాలి. పండ్లు, స్వీట్లును నైవేద్యంగా పెట్టాలి. ఆ తర్వాత పసుపు కలిపిన అక్షతలను దేవుడు ముంచు ఉంచాలి. విష్ణుసహస్త్రనామం పఠిస్తూ దైవారాధన చేయాలి. చివరిగా హారతి ఇచ్చి ప్రసాదాన్ని అందరికి పంచిపెట్టాలి. ఈరోజున దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. 

(Disclaimer:  ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also Read: Grah yuti 2024: కుంభరాశిలో మహా సంయోగం.. ఈ 3 రాశులను వరించనున్న అదృష్టం, ఐశ్వర్యం..

Also Read: Gajakesari Yoga 2024: గురుచంద్రుల కలయికతో గజకేసరియోగం.. ఈ రాశికి లాటరీ తగిలినట్టే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More