Home> ఆధ్యాత్మికం
Advertisement

Weekly Rasi Phalalu: జూలై చివరి వారంలో అత్యధిక లాభాలు పొందబోయే రాశులు..


Weekly Rasi Phalalu In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జులై నెలలోని చివరివారం ప్రారంభం కాబోతోంది ఈ వారానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. అయితే ఈ వారంలో కొన్ని రాశుల వారికి చాలా బాగుంటుంది. ఈ సమయంలో ఏయే రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.

Weekly Rasi Phalalu: జూలై చివరి వారంలో అత్యధిక లాభాలు పొందబోయే రాశులు..

Weekly Rasi Phalalu In Telugu: జులై నెలలోని సోమవారంతో కొత్త వారం ప్రారంభం కాబోతోంది. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ వారానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే ఈ వారంలో కూడా కొన్ని ప్రత్యేకమైన గ్రహాలు రాశి  సంచారం చేయబోతున్నాయి. అలాగే ఆగస్టు ఆరవ తేదీ నుంచి శ్రావణమాసం కూడా ప్రారంభం కాబోతోంది..కాబట్టి ఈ వారానికి ప్రత్యేక ప్రాముఖ్యత సంతరించుకుంది. జులై 29 నుంచి ఆగస్టు 4వ తేదీ వరకు ఈ వారం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో శని కూడా కొన్ని మార్పులు చేర్పులు చేసుకోబోతోంది. దీని కారణంగా ఎంతో ప్రత్యేకమైన ప్రభావం అన్ని రాశుల వారిపై పడుతుంది. అయితే ఈ ప్రభావం కొన్ని రాశుల వారికి లాభదాయకంగా ఉంటే మరికొన్ని రాశుల వారికి తీవ్ర దుష్ప్రభావాలను కలిగించబోతోంది. ఈ వారం ఎక్కువగా లాభాలు పొందబోయే రాశుల వారెవరో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఊహించని లాభాలు పొందబోయే రాశులు..:
మేష రాశి: 

ఈ వారం మేష రాశి వారిపై ధనవర్షం కురువబోతోంది. వీరికి ఈ సమయంలో కెరీర్ పరంగా చాలా బాగుంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో వీరు కెరీర్ పరంగా అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు కృషి చేస్తారు. అలాగే కష్టపడి పని చేసే వారికి ఈ సమయం ఎంతో లాభదాయకంగా కూడా మారుతుంది. వ్యాపారాలు చేసే వారికి ధన లాభాలతో పాటు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. ఇక ఆరోగ్యపరంగా చూస్తే వీరికి అంతా బాగుంటుంది. అంతేకాకుండా అనుకున్న పనుల్లో కూడా గొప్ప విజయాలు సాధించగలుగుతారు.

వృశ్చిక రాశి: 
జూలై నెలలోని చివరి వారం వృశ్చిక రాశి వారికి కూడా లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారు కెరీర్ పరంగా అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతారు. అలాగే సానుకూల మార్పుల కారణంగా భౌతిక సుఖాన్ని కూడా పొందుతారు. ఇక డబ్బు పరంగా వీరికి ఎలాంటి లోటు ఉండదు. ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన ఆర్థిక లాభాలతో పాటు మంచి పేరు సంపాదిస్తారు. సమాజ సేవ చేస్తున్న వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది స్నేహితుల నుంచి సపోర్టు లభించి పనులల్లో వేగంగా విజయాలు సాధించగలుగుతారు. 

తులారాశి: 
తులా రాశి వారికి కూడా ఈ కొత్త వారం చాలా అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా ఆర్థిక పరిస్థితులు కూడా చాలా వరకు మెరుగుపడతాయి. అలాగే ఉన్నతాధికారుల నుంచి సపోర్టు లభించి ఉద్యోగాలు చేసే వారికి మంచి అనుకూల వాతావరణం నెలకొంటుంది. దీంతోపాటు ఈ వారం అతిగా ఖర్చులు ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి డబ్బులు ఖర్చు పెట్టే క్రమంలో పల్లె రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. దీంతోపాటు చిరాకు కూడా పెరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి మానసిక సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది.

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

కుంభరాశి: 
కుంభరాశి వారికి కూడా ఈ వారం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దీని కారణంగా వీరు ఎలాంటి పని అయినా సక్రమంగా చేయగలుగుతారు. అలాగే ఆర్థికంగా కూడా ఈ వారం ఎంతో బాగుంటుంది. వ్యాపారాలు చేసేవారు పెట్టుబడులు పెట్టడం కూడా చాలా మంచిది అలాగే కెరీర్ సంబంధించిన జీవితంలో కూడా గొప్ప విజయాలు సాధిస్తారు. ఈ వారం కొత్త కొత్త అవకాశాలు లభిస్తాయి. కాబట్టి సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నించండి.

ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More