Home> ఆధ్యాత్మికం
Advertisement

Ganesh Puja: బుధవారం నాడు వినాయకుడి యెుక్క ఈ పవర్ మంత్రాలు జపిస్తే... ఇక మీ లైఫ్ కు తిరుగుండదు!

Sravana Ganesh Puja: హిందువులు ఏ పండుగ కానీ లేదా కార్యక్రమాన్ని చేసినా ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా జరగాలని ప్రథమ పూజ గణపతికి చేస్తారు. అలాంటి వినాయకుడి యెుక్క ఈ మంత్రాలు బుధవారం నాడు జపిస్తే ఇక మీ లైఫ్ లో ఎటువంటి అడ్డంకులు ఉండవు. 
 

Ganesh Puja: బుధవారం నాడు వినాయకుడి యెుక్క ఈ పవర్ మంత్రాలు జపిస్తే... ఇక మీ లైఫ్ కు తిరుగుండదు!

Sravana Ganesh Puja: శ్రావణ మాసం శివపార్వతులను పూజించడానికి శుభకరమైన  మాసం. అదే విధంగా వారి పుత్రుడైన వినాయకుడిని (Lord Ganesha) కూడా ఈ మాసంలో పూజిస్తే మీ విఘ్నాలన్నీ తొలగిపోయి మంచిరోజులు వస్తాయి. సాధారణంగా దేవతలందరిలో ప్రథమ పూజ గణపతికే చేస్తారు. భక్తులు వినాయకుడిని బుధవారం నాడు పూజిస్తారు. శ్రావణ బుధవారం నాడు వినాయకుడిని ఆరాధించడం వల్ల దాని వల్ల లభించే ఫలితం ఎన్నో రెట్లు ఉంటుంది. ఈ రోజున గణేశుడి యెుక్క ఈ మంత్రాలను (Ganesh Mantralu) పఠించడం వల్ల కెరీర్ లో పురోగతి, వ్యాపారంలో లాభం ఉంటుంది. 

 ఈ మంత్రాలను జపించండి
ప్రాణ ప్రతిష్ఠా మంత్రం: అస్యప్రాణః ప్రతిష్ఠన్తు అసయ్ ప్రాణ క్షరన్తు సి. అసై దేవ్త్వమార్చార్యం మమేహతి చ కశ్చన్ ।
కోరికల నెరవేర్చుకునే మంత్రం:  ఓం గం గణపతే నమః
గణేశుని ఆవాహన మంత్రం: 
గజాననం భూత గణాది సేవితం కపిత జంబు ఫలసార భక్షణమ్ । 
ఉమాసుతం శోకం వినాశకరం నమామి విఘ్నేశ్వర్ పాద పంకజం । 
ధన ప్రాప్తి మంత్రం; ఓం నమో గణపతయే కుబేర్ యేకాద్రికో ఫట్ స్వాహా ।

గణేష్ మంత్రాలను ఎప్పుడు జపించాలి?
బుధవారాల్లో ఈమంత్రాలను పఠించడం వల్ల వినాయకుడి సంతోషిస్తాడు. గణపతిని పూజించి..హారతి తర్వాత ఈ మంత్రాలు జపిస్తే శుభప్రదంగా ఉంటుంది. మంత్రోచ్ఛారణ లేకుండా పూజ సంపూర్ణం అవ్వదు. కాబట్టి పూజానంతరం తప్పనిసరిగా హారతి, మంత్రోచ్ఛారణలు చేయాలి. గణేశుడిని ప్రసన్నం చేసుకోవడానికి, బుధవారం పూజ సమయంలో ఆయనకు ఇష్టమైన లడ్డూలను పెట్టండి.  ఇలా చేయడం వల్ల భక్తులకు కోరిన కోర్కెలు త్వరగా నెరవేరుతాయని చెబుతారు.

Also Read: Naga Panchami 2022: ఆగస్టు 2న నాగపంచమి.. నాగదేవతను ఇలా పూజించండి! 

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Read More