Home> ఆధ్యాత్మికం
Advertisement

Grah Gochar: వచ్చే నెలలో శుక్రుడి గమనంలో పెను మార్పు.. ఈ రాశులను వరించనున్న అదృష్టం, ఐశ్వర్యం..

Shukra Gochar 2023: ఏప్రిల్ నెలలో శుక్రుడి గమనంలో పెను మార్పు రానుంది. దీని కారణంగా ఆరు రాశులపై డబ్బు వర్షం కురవనుంది. ఇందులో మీ రాశి ఉందేమో చూస్కోండి. 
 

Grah Gochar: వచ్చే నెలలో శుక్రుడి గమనంలో పెను మార్పు.. ఈ రాశులను వరించనున్న అదృష్టం, ఐశ్వర్యం..

Shukra Gochar 2023: ఆస్ట్రాలజీ ప్రకారం, ఎవరి జాతకంలో శుక్రుడు శుభస్థానంలో ఉంటాడో వారికి దేనికీ లోటు ఉండదు. సంపదను ఇచ్చే  శుక్రుడు ఏప్రిల్ 6న తన సొంత రాశి అయిన వృషభరాశిలోకి ప్రవేశించనున్నాడు. మే 2 వరకు అదే రాశిలో సంచరిస్తాడు. అంతేకాకుండా ఏప్రిల్ లో బృహస్పతి గజకేసరి రాజయోగం చేస్తున్నాడు. శుక్రుడి వృషభరాశి సంచారం వల్ల ఆరు రాశులవారి అదృష్టం ప్రకాశించనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 

శుక్రుడి సంచారం ఈ రాశులకు శుభప్రదం
మేషరాశి
మేష రాశి వారికి శుక్రుని సంచారం చాలా శుభప్రదం కానుంది. వీరి అన్ని కోరికలు నెరవేరుతాయి. సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు. పని నిమిత్తం బయటకు వెళ్లాల్సి రావచ్చు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. మీ లవ్ అండ్ దాంపత్య జీవితం బాగుంటుంది. 
వృషభం
ఇదే రాశిలో శుక్రుని సంచారం జరగబోతుంది. దీని వల్ల వృషభ రాశి వారికి కొత్త అవకాశాలు అందిపుచ్చుకుంటారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. భారీగా ధనం చేతికి అందుతుంది. మీరు అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి.
కర్కాటక రాశి
శుక్రుని సంచారం వల్ల కర్కాటక రాశివారు డబ్బును బాగా పొదుపు చేస్తారు. మీ శ్రమకు ప్రశంసలు దక్కుతాయి. మీరు కొత్త కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. మీరు వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఇదే అనుకూల సమయం. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది.
కన్య రాశి
శుక్రుని సంచారం కన్యారాశి వారికి శుభ ఫలితాలను ఇవ్వబోతోంది. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. ఆర్థిక సంక్షోభం ఉండదు. అదృష్టం కలిసి వస్తుంది. ప్రేమ జీవితం బాగుంటుంది. 
మకరరాశి
శుక్రుని సంచారం మకరరాశి వారికి అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. మీరు మీ కెరీర్‌లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. డబ్బు ఆదా చేస్తారు. మీరు ఆకస్మిక ధనలాభం పొందుతారు. వ్యాపారంలో భారీగా లాభాలు ఉంటాయి. 
కుంభ రాశి
కుంభ రాశి వారికి శుక్రుని సంచారం అదృష్టాన్ని ఇస్తుంది. మీకు కొత్త ఉద్యోగం లభిస్తుంది. మీరు జీవితంలో సానుకూల ఫలితాలను పొందుతారు. మెుత్తానికి ఈ సమయం మీకు కలిసి వస్తుంది. 

Also Read: Jupiter Transit 2023: ఏప్రిల్ లో ఈ 5 రాశులను వరించనున్న అదృష్టం, ఐశ్వర్యం, పదవి.. ఇందులో మీది ఉందా? 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu    

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Read More