Home> ఆధ్యాత్మికం
Advertisement

Shukra Gcohar 2023: బృహస్పతి ఇంట్లోకి శుక్రుడు.. ఈరాశులకు ఉద్యోగ, వ్యాపారాల్లో భారీ లాభం..

Shukra Gcohar 2023: పంచాంగం ప్రకారం, సంపదను ఇచ్చే శుక్రుడు తన ఉన్నతమైన మీన రాశిలో సంచరించబోతున్నాడు. దీని వల్ల 3 రాశుల వారు భారీగా డబ్బును గడిస్తారు. 
 

Shukra Gcohar 2023: బృహస్పతి ఇంట్లోకి శుక్రుడు.. ఈరాశులకు ఉద్యోగ, వ్యాపారాల్లో భారీ లాభం..

Venus Planet Transit In Pisces 2023: ఆస్ట్రాలజీ ప్రకారం, ప్రతి గ్రహం నిర్ధిష్ట సమయం తర్వాత తన రాశిని మారుస్తుంది. ఐశ్వర్యాన్ని ఇచ్చే  శుక్రుడు మరో మూడు రోజుల్లో అంటే ఫిబ్రవరి 15న మీనరాశిలోకి ప్రవేశించనున్నాడు. మీన రాశిని బృహస్పతి గ్రహం పాలిస్తుంది. ప్రస్తుతం మీనంలో గురుడు యవ్వన దశలో ఉన్నాడు. మీన రాశిలో శుక్రుడి గోచారం మూడు రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది. ఆ లక్కీ రాశులేంటో ఓ లుక్కేద్దాం. 

వృషభ రాశి
వృషభ రాశి వారికి శుక్రుని సంచారం శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే శుక్ర గ్రహం మీ రాశి నుండి 11వ ఇంట్లో సంచరించబోతోంది. దీంతో మీరు పాత పెట్టుబడుల నుండి ప్రయోజనం పొందుతారు. ఆదాయంలో రెట్టింపు పెరుగుదల ఉంటుంది. మీరు షేర్ మార్కెట్, బెట్టింగ్ మరియు లాటరీలలో పెట్టుబడి పెట్టడం వల్ల భారీగా లాభపడతారు. ఈ సమయంలో మీ కోరికలన్నీ నెరవేరుతాయి. 
ధనుస్సు రాశిచక్రం
శుక్రుని రాశిచక్రం ధనుస్సు రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే మీ సంచార జాతకంలో కూడా మాళవ్య మరియు హన్స్ అనే రాజయోగం ఏర్పడబోతోంది. అందుకే మీరు ఈ సమయంలో ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. అలాగే మీరు పూర్వీకుల ఆస్తిని పొందుతారు.  టూరిజం, ట్రావెల్, రియల్ ఎస్టేట్, హోటల్ లైన్‌కు సంబంధించిన వారికి ఈ సమయం బాగుంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. 
మిథున రాశిచక్రం
శుక్రుడి రాశి మార్పు మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే మీ సంచార జాతకంలో మాలవ్య మరియు హన్స్ అనే రాజయోగం ఏర్పడబోతోంది. అందుకే ఈ సమయంలో ఉద్యోగ వృత్తిలో ఉన్నవారు ఇంక్రిమెంట్ మరియు ప్రమోషన్ పొందుతారు. అలాగే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు కూడా ఉద్యోగాలు సాధిస్తారు. వ్యాపారస్తులు ఆకస్మిక లాభాలను గడిస్తారు. బిజినెస్ విస్తరిస్తుంది. 

Also Read: Surya Gochar 2023: రేపే కుంభరాశిలో సూర్య గోచారం.. నెల రోజులపాటు ఈ రాశులకు లక్కే లక్కు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More