Home> ఆధ్యాత్మికం
Advertisement

Shukra Gochar 2023: గురు రాశిలో శుక్రుని సంచారం.. ఈ రాశులకు బంపర్ బెనిఫిట్స్...

Shukra Gochar 2023: ఫిబ్రవరి 15న శుక్రుడు బృహస్పతి రాశిలోకి ప్రవేశించనున్నాడు. దీంతో కొన్ని రాశులవారు బంపర్ బెనిఫిట్స్ పొందనున్నారు. 
 

Shukra Gochar 2023: గురు రాశిలో శుక్రుని సంచారం.. ఈ రాశులకు బంపర్ బెనిఫిట్స్...

Shukra Gochar In Pisces 2023: ఆస్ట్రాలజీ ప్రకారం, ఈ నెలలో మూడు పెద్ద గ్రహాలు తమ స్థానాలను మార్చుకోనున్నాయి. అందులో శుక్రగ్రహం ఒకటి. ఫిబ్రవరి 15న శుక్రుడు మీన రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఇప్పటికే మీనరాశిలో బృహస్పతి సంచరిస్తున్నాడు. వీరి కలయిక ప్రభావం మే నెల వరకు ఉంటుంది. మీనంలో శుక్రుడి గోచారం వల్ల నాలుగు రాశులవారు అపారమైన ప్రయోజనాలను పొందనున్నారు. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 

శుక్ర-గురు కలయిక ఈ రాశులకు శుభప్రదం
మేషరాశి
మేష రాశి వారికి గురు, శుక్రుల కలయిక అనుకూలంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో సంతోషం నెలకొంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీ అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. ఈ సమయంలో శత్రువులతో జాగ్రత్తగా ఉండండి. 
కర్కాటక రాశి 
మీనంలో రెండు శుభ గ్రహాల కలయిక వల్ల కర్కాటక రాశివారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. విదేశాలకు వెళ్లాలనే మీ కోరిక నెరవేరుతుంది. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. వ్యాపారులు భారీగా లాభాలను ఆర్జిస్తారు. ఈ సమయంలో మీరు ఏదైనా లగ్జరీ వస్తువును కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీ ఆదాయం రెట్టింపు అయ్యే అవకాశం ఉంది.
మీనరాశి
ఈ రాశిలోనే వీరిద్దరి కలయిక ఏర్పడనుంది. దీంతో మీనరాశి వారి అదృష్టం పెరుగుతుంది. వ్యాపారంలో మంచి లాభాలు కనిపిస్తాయి. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. మీరు కెరీర్‌లో సరికొత్త శిఖరాలను అధిరోహిస్తారు. మెుత్తానికి ఈ సమయం మీకు అద్భుతంగా ఉండబోతుంది. 

Also Read: Kumbha Sankranti 2023: ఇవాళే కుంభ సంక్రాంతి... ఈ రాశులను వరించనున్న అదృష్టం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More