Home> ఆధ్యాత్మికం
Advertisement

Shukra Gochar 2023: వచ్చే నెల 2 నుంచి ఈ 4 రాశులకు అన్నీ లాభాలే.. ఇందులో మీ రాశి ఉందా?

Shukra Gochar 2023: వచ్చే నెల మెుదటి వారంలో శుక్రుడు తన సొంత రాశిని విడిచిపెట్టి బుధుడి యెుక్క రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ శుక్రుని సంచారం కారణంగా కొన్ని రాశులవారు బంఫర్ బెనిఫిట్స్ పొందబోతున్నారు. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
 

Shukra Gochar 2023: వచ్చే నెల 2 నుంచి ఈ 4 రాశులకు అన్నీ లాభాలే.. ఇందులో మీ రాశి ఉందా?

Venus transit 2023: ఆస్ట్రాలజీలో శుక్రుడిని శుభగ్రహంగా భావిస్తారు. ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు ప్రస్తుతం వృషభరాశిలో సంచరిస్తున్నాడు. మే 2వ తేదీ మధ్యాహ్నం 1.36 గంటలకు వృషభరాశిని విడిచిపెట్టి వృషభరాశిలోకి శుక్రుడు ప్రవేశించనున్నాడు. అదే రాశిలో మే 30 వరకు ఉండనున్నాడు. దీని తర్వాత శుక్రుడు చంద్రుడి రాశి అయిన కర్కాటక రాశిలో సంచరించనున్నాడు. శుక్రుడి రాశి మార్పు కారణంగా ఏయే రాశులవారు లాభం పొందనున్నారో తెలుసుకుందాం. 

శుక్రుడు సంచారం ఈ రాశులకు వరం
మిథున రాశి
మీ రాశి యెుక్క మొదటి ఇంట్లో శుక్రుడు ప్రవేశించనున్నాడు. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. మీకు సంతానప్రాప్తి కలుగుతుంది. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. 
సింహ రాశి
ఈ రాశి యెుక్క పదకొండవ ఇంట్లో శుక్రుడు సంచరిస్తున్నాడు. దీంతో మీ ఆదాయం రెట్టింపు అవుతుంది. మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. మీకు ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ లభించే అవకాశం ఉంది. మీ కెరీర్ లో మంచి పురోగతి ఉంటుంది. హెల్త్ పై శ్రద్ధ తీసుకోండి. 

Also read: Mercury Set 2023: బుధుడు అస్తమయంతో ఈ 3 రాశుల జీవితం స్వర్గం.. ఇందులో మీరున్నారా?

మేష రాశి
మీ జాతకంలోని మూడో ఇంట్లో శుక్రుడు సంచరించనున్నాడు. మీ ఆదాయం డబల్ అవుతుంది. మీకు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సపోర్టు లభిస్తుంది. వ్యాపారులు భారీగా లాభపడతారు. లవ్ లైఫ్ బాగుంటుంది. ఉద్యోగులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. 
వృషభ రాశి
ఈ రాశి యెుక్క రెండవ ఇంట్లో శుక్రుడు సంచరించనున్నాడు. మీకు కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలన్నీ తొలగిపోతాయి. వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. 

Also Read: Surya Gochar 2023: రాబోయే 20 రోజులు ఈ రాశులకు డబ్బే డబ్బు.. ఇందులో మీ రాశి ఉందా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Read More