Home> ఆధ్యాత్మికం
Advertisement

Shukra Gochar 2023: జూలై 07 వరకు కర్కాటక రాశిలోనే శుక్రుడు.. ఈ 3 రాశులకు ఊహించనంత ధనం..

Shukra Gochar 2023: గ్రహాలు కాలానుగుణంగా రాశులను మారుస్తాయి. ప్రస్తుతం శుక్రుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. శుక్ర గ్రహం గోచారం వల్ల జూలై 07 వరకు మూడు రాశులవారు ఊహించని లాభాలను పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
 

Shukra Gochar 2023:  జూలై 07 వరకు కర్కాటక రాశిలోనే శుక్రుడు.. ఈ 3 రాశులకు ఊహించనంత ధనం..

Venus Transit 2023 effect: ఐశ్వర్యానికి కారకుడైన శుక్రుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. ఇదే రాశిలో వచ్చే నెల 06 వరకు ఉంటాడు. అనంతరం జూలై 07న శుక్రుడు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. కర్కాటకరాశిలో శుక్ర సంచారం మూడు రాశులవారికి ఆకస్మిక ధనలాభాన్ని ఇవ్వనుంది. ఆ రాశులేవో తెలుసుకుందాం. 

శుక్రుడి సంచారం ఈ 3 రాశులకు వరం
తులారాశి
శుక్రుడి సంచారం తులరాశి వారికి కలిసి వస్తుంది. మీ రాశి యెుక్క ఆదాయ గృహంలోని దీని సంచారం జరగబోతుంది. దీంతో మీ ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. మీకు కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. ఏదైనా పని లేదా వ్యాపారం మెుదలుపెట్టడానికి ఇదే మంచి సమయం. మీకు ప్రతి పనిలో అదృష్టం కలిసి వస్తుంది. మీరు శత్రువులపై విజయం సాధిస్తారు. మీ ఆర్థికంగా లాభపడతారు. స్టాక్ మార్కెట్, బెట్టింగ్ మరియు లాటరీలో డబ్బు పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రయోజనం పొందుతారు. 
వృషభం
శుక్రుడి సంచరం వృషభరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీ రాశి యెుక్క నాల్గో ఇంట్లో శుక్రుడి సంచారం జరగబోతుంది. దీంతో మీరు ఏదైనా ఆస్తి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం బాగుంటుంది. మీరు కుటుంబంతో విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. ఆఫీసులో మీరు కొత్త బాధ్యతలను తీసుకుంటారు. మీరు ఆర్థికంగా లాభపడతారు. స్థిర చరాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. 

Also Read: Mercury set 2023: ఈ నెల 19న బుధుడి అస్తమయం... ఈ 3 రాశులకు ఉద్యోగ, వ్యాపారాల్లో భారీగా నష్టం..

కుంభ రాశి
సింహరాశిలో శుక్రుని ప్రవేశం కుంభ రాశి వారికి మంచి లాభాలను ఇస్తుంది. మీ రాశి యెుక్క ఏడో ఇంట్లో శుక్రుడి సంచారం జరగబోతుంది. దీంతో మీ వైవాహిక జీవితంలో సంతోషం వెల్లివిరిస్తుంది. వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. 

Also Read: Mangal Gochar 2023: మరో 20 రోజులపాటు ఈ రాశులకు డబ్బే డబ్బు.. లాభాలే లాభాలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More