Home> ఆధ్యాత్మికం
Advertisement

Venus Transit August 2022: ఆగస్ట్ 7 నుంచి మారనున్న వీళ్ల అదృష్టం.... 23 రోజులపాటు ఈ రాశులపై డబ్బే డబ్బు..!

Venus Transit 2022: మరో ఐదు రోజుల్లో శుక్రుడు తన రాశిని మార్చబోతున్నాడు.దీని ప్రభావం మెుత్తం 12 రాశులపై ఉంటుంది. ముఖ్యంగా వీనస్ ట్రాన్సిట్ 5 రాశులవారి అదృష్టం ప్రకాశించేలా చేస్తుంది. 
 

Venus Transit August 2022: ఆగస్ట్ 7 నుంచి మారనున్న వీళ్ల అదృష్టం.... 23 రోజులపాటు ఈ రాశులపై డబ్బే డబ్బు..!

Shukra Gochar August 2022: ప్రేమ, శృంగారం, సంపద, లగ్జరీ లైఫ్ కు కారకుడు శుక్రుడు. జాతకంలో శుక్రుడు శుభ స్థానంలో ఉంటే.. ఆ వ్యక్తి మంచి జీవితాన్ని గడుపుతాడు. అతడికి ఎప్పుడు డబ్బుకు లోటు ఉండదు. అంతేకాకుండా అతడి లవ్ లైఫ్ కూడా బాగుంటుంది. ఇన్నింటికి కారణమైన శుక్రుడు తన రాశిని మార్చబోతున్నాడు. మరో 5 రోజుల్లో అంటే 7 ఆగస్టు 2022న శుక్రుడు మిథున రాశి నుంచి కర్కాటకరాశిలోకి (Venus Transit in Cancer 2022) ప్రవేశించనున్నాడు. అక్కడే ఆగస్టు 31 వరకు ఉండనున్నాడు. శుక్రుడు సంచారం వల్ల ఐదు రాశులవారు లాభపడనున్నారు. 

మేషం (Aries): శుక్రుని సంచారం వల్ల మేష రాశి వారికి అపారమైన డబ్బు వస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కెరీర్ లో పురోగతి ఉంటుంది. కొత్త జాబ్ రావచ్చు. నిరుద్యోగులు పరీక్ష,ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. 

వృషభం (Taurus) : కర్కాటకంలో శుక్రుడి సంచారం వృషభ రాశి వారికి కలిసి వస్తుంది. ఉద్యోగం మారాలనుకునేవారికి ఇదే మంచి సమయం. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. విదేశాలకు వెళ్లాలనుకునేవారి కల నెరవేరుతుంది.  

మిథునరాశి (Gemini): శుక్రుని సంచారం మిథున రాశి వారికి మేలు చేస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా జీతం పెరిగే అవకాశం ఉంది. ధనం లాభదాయకంగా ఉంటుంది. వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది. 

కన్య (Virgo): ఈ వారికి శుక్రుడు మార్పు అన్ని రంగాలలో విజయాన్ని ఇస్తుంది. కొత్త ఉద్యోగం వస్తుంది. సీనియర్లు లేదా ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తుల మద్దతు లభిస్తుంది. ఇది మీకు లాభదాయకంగా ఉంటుంది. 

తుల (Libra): తుల రాశి వారికి వీనస్ ట్రాన్సిట్ చాలా శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాలలో విజయం సాధిస్తారు. కొత్త జాబ్ వస్తుంది. ఆఫీసులో ప్రశంసలు దక్కుతాయి. 

Also Read: ఆగస్టు 2న నాగ పంచమి.. మీ రాశి ప్రకారం మంత్రాలతో నాగదేవతను ఇలా పూజించండి! 

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Read More