Home> ఆధ్యాత్మికం
Advertisement

Shukra Gochar 2023: ఈ నెల చివరిలో శుక్రుడి గమనంలో పెను మార్పు.. ఈ రాశులకు గుడ్ టైమ్ స్టార్ట్..

Venus transit 2023: ఈ నెల చివరిలో శుక్రుడు కర్కాటక రాశి ప్రవేశం చేయనున్నాడు. శుక్రుడి రాశి మార్పు మెుత్తం 12 రాశులవారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. శుక్ర సంచారం ఏయే రాశులవారికి కలిసి వస్తుందో తెలుసుకుందాం. 
 

Shukra Gochar 2023:  ఈ నెల చివరిలో శుక్రుడి గమనంలో పెను మార్పు.. ఈ రాశులకు గుడ్ టైమ్ స్టార్ట్..

Shukra Gochar 2023 in Cancer: ఆస్ట్రాలజీలో శుక్రుడిని శుభగ్రహంగా భావిస్తారు. ఆనందం, ఐశ్వర్యం మరియు లగ్జరీ లైఫ్ కు కారకుడిగా శుక్రుడిని భావిస్తారు. మే 30న శుక్రుడు కర్కాటక రాశిలో సంచరించబోతున్నాడు. ఈ నెలాఖరులో జరిగే శుక్ర సంచారం కొన్ని రాశులవారికి కలిసి రానుంది. శుక్రుడి రాశి మార్పు వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారో తెలుసుకుందాం. 

కర్కాటక రాశి
ఈ రాశిలోనే శుక్రుడు సంచరించనున్నాడు. దీంతో కర్కాటక రాశి వారు ఆకస్మిక ధనలాభం పొందనున్నారు. మీరు ఏ రంగంలో అడుగుపెట్టినా అందులో విజయం సాధిస్తారు. మీరు ఆర్థికంగా బలపడతారు. పార్టనర్ షిప్ తో చేసే వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. మీ పై అధికారులతో సంబంధాలు బాగుంటాయి. మీ వ్యక్తిత్వంతో అందరినీ ఆకట్టుకుంటారు.
కన్యా రాశి
కన్యారాశి వారికి శుక్ర సంచారం అదృష్టమనే భావించాలి. మీరు ఆర్థికంగా బలపడతారు. మీకు ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. మీకు ప్రతి పనిలో విజయం లభిస్తుంది. వ్యాపారులు అనుకున్న దాని కంటే ఎక్కువ లాభాలను పొందుతారు. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. 

Also read: Venus- Mars Conjunction 2023: మే 30న శుక్రుడు-అంగారకుడు కలయిక.. ఈ 4 రాశులకు అదృష్టం, ఐశ్వర్యం..

మేష రాశి
శుక్ర సంచారం మేషరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. మీరు ఉద్యోగంలో మంచి పురోగతి సాధిస్తారు. మీరు విలువైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం బాగుంటుంది. మీ ఆదాయం డబల్ అవుతుంది. జాబ్ చేసేవారికి ప్రమోషన్ లభిస్తుంది. 
మిథున రాశి
శుక్రుడి రాశి మార్పు కారణంగా మిథున రాశి వారు ఆర్థికంగా బలపడతారు. మీరు బిజినెస్ లో భారీగా లాభాలను ఆర్జిస్తారు. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం లభిస్తుంది. మీరు పూర్వీకుల ఆస్తి ద్వారా ప్రయోజనం పొందుతారు. అంతేకాకుండా కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు.

Also read: June 2023 Grah Gochar: జూన్‌లో ఊహించని పరిణామం.. ఈ 3 రాశులకు జాక్ పాట్ ఖాయం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More