Home> ఆధ్యాత్మికం
Advertisement

Dhan Yog: మరో 10 రోజుల్లో ఈ 3 రాశులకు మంచి రోజులు రాబోతున్నాయి.. మీరున్నారా?

Benefits of Dhan Yog: ఈ నెల చివరిలో శుక్రుడు తన రాశిని మార్చనున్నాడు. దీని కారణంగా అరుదైన ధన రాజయోగం ఏర్పడబోతుంది. ఇది మూడు రాశులవారికి లాభాలను ఇవ్వనుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 
 

Dhan Yog: మరో 10 రోజుల్లో ఈ 3 రాశులకు మంచి రోజులు  రాబోతున్నాయి.. మీరున్నారా?

Shukra Gochar 2023 Effect:  ప్రతి గ్రహం పర్టికలర్ టైం తర్వాత తన రాశిని ఛేంజ్ చేస్తోంది. ఈ నెలలో చాలా గ్రహాలు తమ రాశులను ఛేంజ్ చేశాయి. ఈ నెల చివరిలో అంటే మే 30న ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు కర్కాటక రాశిలో సంచరించబోతున్నాడు. శుక్రుడి రాశి మార్పు వల్ల ధనయోగం ఏర్పడుతుంది. కర్కాటకంలో శుక్రుడు సంచారం వల్ల మీరు తిరుగులేని ప్రయోజనాలు పొందబోతున్నారు.  ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 

ధన రాజయోగం ఈ రాశులకు వరం
మిధునరాశి
మిథునరాశి యెుక్క  5వ మరియు 12వ ఇంటికి అధిపతిగా శుక్రుడిని భావిస్తారు. ఇతడు ఈ రాశి యెుక్క రెండో ఇంట్లో సంచరించబోతున్నాడు. శుక్రుడి సంచారంతో మిథునరాశి తెలివితేటలు పెరుగుతాయి. అంతేకాకుండా మీ డబ్బు పెరుగుతుంది.  మీ వ్యాపారం వృద్ధి చెందుతుంది. పార్టనర్ షిప్ తో చేసే వ్యాపారం మంచి లాభాలను ఇస్తుంది. 
కర్కాటక రాశి
శుక్రుడు ఈ రాశి వారికి ప్రత్యేక ప్రయోజనాలు ఇవ్వబోతున్నాడు. మీకు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. కర్కాటక రాశి వారిపై లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీస్సులు ఉంటాయి. మీరు పూర్వీకుల ఆస్తి ద్వారా ప్రయోజనం పొందుతారు. మీరు ఊహించని విధంగా డబ్బు సంపాదిస్తారు. మీరు కెరీర్ లో ఊహించని స్థాయికి ఎదుగుతారు. 
కన్య రాశి
కన్యా రాశి యెుక్క రెండవ మరియు తొమ్మిదవ ఇంటికి శుక్రుడు అధిపతి. మీరాశి యెుక్క 11వ ఇంట్లో  శుక్రుడు ధన యోగాన్ని సృష్టిస్తున్నాడు. వ్యాపారులకు ఈ సమయం లాభదాయకంగా ఉంటుంది. మీ ఆదాయ రెట్టింపు అవుతుంది. ఉద్యోగులకు ఇంక్రిమెంట్, బోనస్ తోపాటు ప్రమోషన్ కూడా లభించే అవకాశం ఉంది. ఆఫీసులో మీ ప్రాబల్యం పెరుగుతుంది. 

Also Read: Guru Chandra Yuti 2023: మేషరాశిలో అరుదైన రాజయోగం... ఈ 3 రాశులవారిపై కనక వర్షం.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More