Home> ఆధ్యాత్మికం
Advertisement

Venus Transit 2023: శుక్రుడి సంచారంతో ఈ రాశుల వారు జీవితాల్లో చీకటి రోజులు దూరం కాబోతున్నాయి..

Venus Transit 2023: నవంబర్ 30వ తేదీన జరిగే శుక్ర గ్రహ సంచారం కారణంగా కొన్ని రాశుల వారిపై ప్రత్యేక ప్రభావం పడబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రభావం కారణంగా ఊహించని లాభాలతో పాటు, భాగస్వాముల మధ్య ప్రేమ పెరిగే ఛాన్సులు ఉన్నాయి. అయితే ఏయే రాశుల వారిపై ఎలాంటి ప్రభావం పడబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Venus Transit 2023: శుక్రుడి సంచారంతో ఈ రాశుల వారు జీవితాల్లో చీకటి రోజులు దూరం కాబోతున్నాయి..

Venus Transit 2023: నవంబర్ నెలలో ఎంతో ముఖ్యమైన గ్రహాలు సంచారం చేసిన సంగతి అందరికీ తెలిసిందే.. నవంబర్ నెలలోని చివరి వారం జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన శుక్ర గ్రహం కూడా సంచారం చేయబోతోంది. ఐశ్వర్యం, అందం, ప్రేమ, గొప్పతనానికి సూచికగా భావించే శుక్రుడు ఈ నెల 30వ తేదీన రాశి సంచారం చేయబోతున్నాడు. ఈ సంచారం తులా రాశిలో జరగబోతోంది. కాబట్టి కొన్ని రాశుల వారికి ప్రత్యేక ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే ఏయే రాశుల వారికి ఈ సమయంలో లాభాలు కలుగుతాయో మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ముఖ్యంగా ఈ శుక్రుడి సంచారం కారణంగా మేష రాశి వారికి చాలా మేలు జరుగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ రాశి వారు ఏదైనా వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల మంచి లాభాలు పొందుతారు. అంతేకాకుండా కొత్త ఆస్తులను కొనుగోలు చేసే ఛాన్సులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో బంధం మరింత బలపడుతుంది. అంతేకాకుండా ప్రేమ జీవితం గడుపుతున్న వారికి శృంగారం కూడా రెట్టింపు అవుతుంది. ఇక ఒంటరి జీవితం గడిపేవారు ఈ సమయంలో ఊహించని ఫలితాలు పొందుతారు.

Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్

ఈ సంచారం తులారాశి వారిపై కూడా ప్రత్యేక ప్రభావాన్ని చూపబోతోంది దీనివల్ల ఈ రాశి వారు ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయాలు సాధిస్తారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఈ రాశి వారికి నిలిచిపోయిన పనులు కూడా సులభంగా ప్రారంభమవుతాయి. శుక్రుడి అనుగ్రహం లభించి ప్రేమ జీవితంలో ఊహించని లాభాలు కలుగుతాయి. ఇక ఆర్థిక సమస్యలన్నీ దూరమవ్వడమే కాకుండా డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు.. ఎప్పటినుంచో పెండింగ్లో ఉన్న డబ్బులన్నీ తిరిగి పొందుతారు. ఈ సమయంలో మీ కెరీర్ కు సంబంధించిన ప్రణాళికలను కూడా పొందుతారు. ఇక ఈ రాశి వారు కుటుంబ సభ్యులతో కలిసి యాత్రలకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి.

శుక్రుడి సంచారం మిధున రాశి వారిపై కూడా చాలా ప్రభావాన్ని చూపబోవుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఈ సంచారం కారణంగా ఆకస్మిక ఆర్థిక లాభాలు పొందడమే కాకుండా అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా జీవిత భాగస్వాముల మధ్య బంధం మరింత బలపడే ఛాన్స్ ఉన్నాయి దీంతోపాటు వీరు విదేశీ పర్యటనలు కూడా చేయవచ్చు.

Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More