Home> ఆధ్యాత్మికం
Advertisement

Venus Transit 2023: ఈ రాశువారు లగ్జరీ, ఆనందం, కీర్తి పొందబోతున్నారు!

Venus Transit 2023: శుక్రుడి సంచారం కారణంగా కొన్ని రాశులవారికి ఊహించని లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా కన్య రాశి, వృశ్చిక రాశితో పాటు కొన్ని రాశులవారికి కుటుంబలో సంతోషం కూడా రెట్టింపు అవుతుంది. 

Venus Transit 2023: ఈ రాశువారు లగ్జరీ, ఆనందం, కీర్తి పొందబోతున్నారు!

 

Venus Transit 2023: శుక్ర గ్రహాన్ని లగ్జరీ, ఆనందం, వైభవం, కీర్తి, ప్రేమకు చిహ్నంగా పరిగణిస్తారు. జాతకంలో శుక్రుడు సుభ స్థానంలో ఉంటే వ్యక్తి జీవితంలో ఆనందం, శ్రేయస్సు పెరుగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే శుక్రుడు రాశి సంచారం చేయబోతోంది. అయితే నవంబర్ 3వ తేదీ తెల్లవారుజామున 4:58 గంటలకు శుక్రుడు కన్యారాశిలోకి సంచారం చేయబోతున్నాయి. సింహరాశి నుంచి కన్యారాశి రాశివారికి కొన్ని ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

ఈ రాశులవారిపై ప్రత్యేక ప్రభావం:
కన్యా రాశి:

కన్యా రాశి వారికి అదృష్టం రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా పెట్టుబడులు పెట్టేవారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఊహించని లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయం విద్యార్థులకు చాలా శుభ సమయంగా మారుతుంది. అంతేకాకుండా కుటుంబంలో సంతోషం కూడా పెరుగుతుంది. జీవితంలో ఆనందం, శ్రేయస్సు కూడా రెట్టింపు అవుతుంది. వివాహాల కోసం చూస్తున్నవారికి మంచి భాగస్వామి లభిస్తుంది. 

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

వృశ్చిక రాశి:
వృశ్చిక రాశి వారికి శుక్రుడి సంచారం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా వ్యాపారాల్లో ఒప్పందాలు కూడా చేసుకునే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు విదేశాలకు వెళ్లే ఛాన్స్‌లు కూడా ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. వ్యాపారం చేసేవారికి పెట్టుబడులు పెట్టడం వల్ల మంచి లాభాలు పొందుతారు. అంతేకాకుండా కుటుంబ మద్ధతు కూడా లభిస్తుంది.

కర్కాటక రాశి:
శుక్రుని సంచారం కారణంగా కర్కాటక రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. కెరీర్‌లో మంచి లాభాలు పొందుతారు. అంతేకాకుండా ప్రేమ జీవితం రొమాన్స్‌గా మారుతుంది. ఈ సమయంలో జీవిత భాగస్వామి మద్దతు లభించి ఊహించని లాభాలు పొందుతారు. దీంతో పాటు వ్యక్తిగతంలో సంతోషం, శ్రేయస్సు రెట్టింపు అవుతుంది. 

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More