Home> ఆధ్యాత్మికం
Advertisement

Shukra Gochar 2022: కర్కాటకంలో శుక్రుడు సంచారం... ఆగస్టు 31 వరకు ఈ 3 రాశులవారికి డబ్బే డబ్బు!

Venus Transit 2022: ఈ నెల మెుదటి వారంలో శుక్రుడు తన రాశిని మార్చాడు. దీని ప్రభావం మూడు రాశులవారికి కలిసి రానుంది. 
 

Shukra Gochar 2022: కర్కాటకంలో శుక్రుడు సంచారం... ఆగస్టు 31 వరకు ఈ 3 రాశులవారికి డబ్బే డబ్బు!

Venus Transit 2022: ప్రతి గ్రహం నిర్ధిష్ట సమయం తర్వాత తన రాశిని మారుస్తుంది. దీని ప్రభావం మెుత్తం 12 రాశులపై ఉంటుంది. ఆగస్టు నెలలో చాలా గ్రహాలు తమరాశిని మార్చబోతున్నాయి. ఈ నెల 7న శుక్రుడు కర్కాటక రాశిలో (Venus Transit In Cancer 2022) సంచరించాడు. అక్కడే ఆగస్టు 31 వరకు ఉండనున్నాడు. లవ్, శృంగారం, సంపద, విలాసాలకు కారకుడు శుక్రుడు. దీని సంచార ప్రభావం మూడు రాశుల వారికి శుభప్రదంగా ఉండనుంది. 

కన్య (Virgo) - కన్య రాశి జాతకంలో 11వ ఇంట్లో ఈ సంచారం జరుగుతుంది. ఈ సమయంలో ఆదాయం పెరుగుతుంది. అనేక రకాలుగా మీకు డబ్బు సమకూరుతుంది. కెరీర్, మీడియా, ఫిల్మ్, బ్యాంకింగ్ లేదా ఫ్యాషన్ డిజైనింగ్ రంగానికి సంబంధించిన వ్యక్తులు ఈ సమయంలో ప్రయోజనం పొందనున్నారు. వీరికి అదృష్టం ఉంటుంది. కన్యా రాశి వారికి పచ్చ రత్నం ధరించడం వల్ల మేలు జరుగుతుంది. 

తుల (Libra)- శుక్ర గ్రహం ఈ రాశి యెుక్క పదవ ఇంట్లోకి ప్రవేశించింది. ఇది వ్యాపార మరియు ఉద్యోగ స్థలంగా భావిస్తారు. కొత్త జాబ్ వస్తుంది. వ్యాపారం విస్తరించే అవకాశం ఉంది. వ్యాపారులు భారీగా లాభపడతారు.ఆఫీసులో కొలిగ్స్ సపోర్టు లభిస్తుంది. ఈ సమయంలో వజ్రాన్ని ధరించడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

సింహం (Leo)- శుక్రుడు ఈ రాశిచక్రంలోని రెండో ఇంటిలో సంచరించాడు. ఇది డబ్బు మరియు ప్రసంగం యొక్క ఇల్లుగా పరిగణిస్తారు. వీరికి అనేక రకాలుగా డబ్బు వస్తుంది. వ్యాపారులు పెద్ద పెద్ద ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు. పార్టనర్ షిప్ తో చేసిన పనులు లాభాలను ఇస్తాయి. సోదరుల సహకారం లభిస్తుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి ఇదే మంచి సమయం. 

Also Read: Sun Transit effect on Scorpio: సూర్యుడి రాశి మార్పు.. ఆగస్టు 17 నుండి ఈ రాశివారికి డబ్బే డబ్బు! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Read More