Home> ఆధ్యాత్మికం
Advertisement

Venus Transit 2023: అరుదైన యోగం చేయబోతున్న శుక్రుడు... ఫిబ్రవరిలో ఈ రాశులకు జాక్ పాట్ ఖాయం..

Venus Transit 2023: శుక్ర గ్రహం ఫిబ్రవరి నెలలో రాశిని మార్చబోతుంది. దీని కారణంగా అరుదైన రాజయోగం ఏర్పడుతుంది. ఇది మూడు రాశులవారికి కలిసిరానుంది. 
 

Venus Transit 2023: అరుదైన యోగం చేయబోతున్న శుక్రుడు... ఫిబ్రవరిలో ఈ రాశులకు జాక్ పాట్ ఖాయం..

Venus Transit 2023 February effect: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి గ్రహం ఒక నిర్దిష్ట సమయంలో తన రాశిని మారుస్తుంది. ఈ గ్రహ సంచారాల పరంగా ఫిబ్రవరి నెల చాలా ముఖ్యమైనది. లవ్, రొమాన్స్, లగ్జరీ లైఫ్ మరియు ఐశ్వర్యానికి శుక్రుడు కారకుడు. ఫిబ్రవరి 15, 2023న మీన రాశిలోకి వీనస్ ప్రవేశించనున్నారు. మీనరాశిలో శుక్రుని ప్రవేశం కారణంగా అరుదైన 'మాలవీయ మహాపురుష రాజయోగం' ఏర్పడుతుంది. ఆస్ట్రాలజీలో  ఈ యోగాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ రాజయోగం మూడు రాశులవారికి ప్రయోజనకరంగా ఉండనుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 

శుక్ర సంచారం ఈ రాశులకు వరం
మిథునం (Gemini): మాళవ్య రాజయోగం మిథున రాశి వారికి విపరీతమైన ఆర్థిక ప్రయోజనాలను ఇస్తుంది. ఈ రాశివారు తమ పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. వ్యాపారం వృద్ధి చెందుతుంది. నిరుద్యోగులకు కొత్త జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులు కోరుకున్న చోటుకి ట్రాన్సఫర్ అయ్యే  అవకాశం ఉంది. పార్టనర్ షిప్ తో చేసే వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. 
కన్య (Virgo): శుక్రుని సంచారం వల్ల ఏర్పడిన మాళవ్య రాజయోగం కన్యారాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. దీంతో మీరు భారీగా డబ్బును పొందుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. జీవిత భాగస్వామితో సంబంధాలు బలపడతాయి. విదేశీ పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది. 
ధనుస్సు (Sagittarius): శుక్రుడు మారడం వల్ల ఏర్పడిన మాళవ్య రాజయోగం ధనుస్సు రాశి వారికి అదృష్టాన్ని ప్రకాశవంతం చేస్తుంది. వీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. మీరు ఏదైనా ఇల్లు లేదా కారును కొనుగోలు చేసే అవకాశం ఉంది. రాజకీయాల్లో చురుగ్గా ఉండే వ్యక్తులు పెద్ద పదవిని పొందే అవకాశం ఉంది. మానసిక ఒత్తిడి నుండి బయటపడతారు. జీవితంలో సంతోషం నెలకొంటుంది.

Also Read: Mercury Transit 2023: ఈ ఐదు రాశులవారికి 20 రోజుల వరకూ రెండు చేతులా సంపాదనే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More