Home> ఆధ్యాత్మికం
Advertisement

Shukra Gochar 2023: మార్చి 12న మేషరాశిలోకి ప్రవేశించనున్న శుక్రుడు.. 24 గంటల్లో తిరగనున్న వీరి దశ

Shukra Gochar 2023: రేపు శుక్ర సంచారం జరగబోతుంది. లవ్ గురు తన రాశిని మార్చి మేషరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. శుక్రుడి సంచారం ఏ రాశులవారికి శుభప్రదమో తెలుసుకోండి.
 

Shukra Gochar 2023: మార్చి 12న మేషరాశిలోకి ప్రవేశించనున్న శుక్రుడు.. 24 గంటల్లో తిరగనున్న వీరి దశ

Shukra Gochar 2023: గ్రహాల సంచారం పరంగా మార్చి నెల చాలా ముఖ్యమైనది. మార్చి 12న శుక్రుడు మీనరాశిని వదలి మేషరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ సంచారం మార్చి 12 ఉదయం 08.13 గంటలకు జరగబోతోంది. దీంతో కొన్ని రాశులవారు ప్రత్యేక ప్రయోజనాలు పొందనున్నారు. శుక్రుడి సంచారం కారణంగా ఏ రాశులవారికి మంచి రోజులు మెుదలుకానున్నాయో తెలుసుకుందాం. 

శుక్రుడి సంచారం ఈ రాశులకు శుభప్రదం

మీనం (Pisces): మీన రాశి యెుక్క రెండో ఇంట్లో శుక్ర సంచారం జరగనుంది. దీంతో మీరు ఆకస్మిక ధనలాభం పొందుతారు. అత్తమామలతో సంబంధాలు మెరుగ్గా ఉంటాయి. ఆఫీసులో మీ పరిస్థితి బాగుంటుంది. ఖర్చులను అదుపులో ఉంచుకోవడం మంచిది. అంతేకాకుండా మీరు డబ్బును ఆదా చేస్తారు. ఆఫీసులో మీ పాపులారిటీ పెరుగుతుంది. 

ధనస్సు (Sagittarius): ఈ రాశిచక్రంలోని ఐదవ ఇంట్లో శుక్రుడు సంచరించబోతున్నాడు. దీంతో మీరు మంచి ఫలితాలను పొందుతారు. పెళ్లికాని వారికి వివాహం కుదిరే అవకాశం ఉంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. మీ కష్టాలు ముగిస్తాయి. భారీగా డబ్బు సంపాదిస్తారు. మెుత్తానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.

సింహం (Leo): శుక్ర సంచారం సింహరాశి యొక్క తొమ్మిదవ ఇంటిలో జరగబోతోంది. రాహువు అప్పటికే ఇక్కడ కూర్చున్నాడు. శుక్రుడు మరియు రాహువు కలయికతో జీవితంలో సానుకూల ప్రభావాలు కనిపిస్తాయి. మీరు తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. మీరు జాబ్ మారడానికి ఇదే మంచి సమయం. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. 

మిథునం (Gemini): ఈ శుక్రుని సంచారం మీ రాశి యెుక్క పదకొండవ ఇంట్లో జరగబోతోంది. శుక్రుడు మరియు రాహువు కలయిక మీకు ప్రతి పనిలో లాభాలను ఇస్తుంది. అనుకోకుండా ధనం వస్తుంది. ఆఫీసులో మీ సహచరుల సపోర్టు లభిస్తుంది. ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది.  ఆగిపోయిన పనులు పూర్తవుతాయి.

మేషం (Aries); శుక్ర సంచారం మేష రాశి యెుక్క లగ్న గృహంలో జరగబోతోంది. దీంతో మీ వ్యక్తిత్వంలో మార్పు వస్తుంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. మీరు ఆర్థికంగా ప్రయోజనం పొందుతారు. వ్యాపారంలో భారీగా లాభాలు ఉంటాయి. లవ్ సక్సెస్ అవుతుంది. 

Also Read: Jupiter transit 2023: మేషరాశి ప్రవేశం చేయనున్న బృహస్పతి.. ఈరాశులకు ఊహించనంత మనీ..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook

Read More